end

కొడుకంత చెట్టు!

కొబ్బరి.. అనగానే  కోనసీమే గుర్తుకొస్తుంది. భారీ ఎత్తున పెరిగే కొబ్బరి చెట్ల వల్లే ఆ ప్రాంతానికి సరికొత్త అందం వచ్చింది. పుష్కలమైన ఆదాయమూ సమకూరుతున్నది.  ఆ కోనసీమ అందాలు తెలంగాణలో కనిపిస్తే..? కనులకు ఇంపుగా అనిపించే ఆ కొబ్బరి తోటలు.. ఇక్కడి రైతులనూ లాభాల బాట పట్టిస్తే..? అవును.. కేరళ, కోనసీమలకే పరిమితమైన కొబ్బరి తోటల అందాలు, త్వరలోనే తెలంగాణలోనూ కనువిందు చేయనున్నాయి. గతంలో సరైన నీటి వసతి లేక కొబ్బరిసాగుపై ఆసక్తి చూపని రైతాంగం, ఇప్పుడు పుష్కలంగా నీటి సౌకర్యం పెరగడంతో ఆ దిశగా ముందడుగు వేస్తున్నది. 

ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నది. 

కొబ్బరి చెట్టు కల్పవృక్ష సమానమైంది. మానవ జీవనంలో ఈ చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. కొబ్బరి ఈనె నుంచి కొబ్బరి నూనె వరకు.. కొబ్బరి కాయ నుంచి కొబ్బరి బెరడు వరకు.. ప్రతి ఒక్కటీ మనిషికి ఉపయోగపడేదే. అందుకోసమే కొబ్బరి చెట్లను పెంచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. మన తెలంగాణలో ఎక్కువగా వ్యవసాయ బావుల వద్ద, పొలం గట్లపైన ఒకటో రెండో చెట్లను మాత్రమే పెంచుకొనేవారు. కానీ, కొబ్బరి తోటలవైపు అడుగు మాత్రం వేయలేకపోయారు. కాళేశ్వరంతో నీటి తిప్పలు తప్పిన తర్వాత.. ఇప్పుడు కొబ్బరి తోటల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో, ఈ ఏడాది ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టు కింద గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో  కొబ్బరి తోటల పెంపకాన్ని చేపడుతున్నది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 1141 ఎకరాల్లో సాగు చేస్తుండగా, 68.46 లక్షల కొబ్బరి కాయల ఉత్పత్తి జరుగుతున్నది. ఇతర జిల్లాల్లోనూ ఆసక్తి ఉన్న రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. 

Exit mobile version