end
=
Thursday, September 19, 2024
బిజినెస్‌భలే భలే..బుడుగుల బెడ్లు!
- Advertisment -

భలే భలే..బుడుగుల బెడ్లు!

- Advertisment -
- Advertisment -

తల్లిదండ్రులకు చిన్నారులే లోకం. అందుకే అపారమైన ప్రేమతో వారిని పెంచుతారు. అంతులేని ఆనందాన్ని పంచుతారు. పిల్లలకు ఇంట్లోనే ఓ కొత్త ప్రపంచాన్ని అందించాలనుకుంటారు. అందుకోసమే వారి గదుల్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ముఖ్యంగా తమ కనుపాపలు కంటి నిండా నిద్రపోవాలని తెగ ఆరాట పడుతుంటారు. అలాంటివారికి ‘బంకు బెడ్లు’ మంచి చాయిస్‌. ఒక బెడ్డు పైన మరోటి ఉండేదాన్నే ‘బంకు బెడ్డు’ అంటారు. వీటి ఎంపికలో నిన్నటిదాకా కొన్ని పరిమితులుండేవి. కానీ, నేడు అలాంటి ఇబ్బందుల్లేవు. తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా రకరకాల బంకు బెడ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. నచ్చిన డిజైన్‌ గురించి చెప్పి.. కొంత సమయమిస్తే చాలు, అంచనాలకు మించి తయారు చేసేవారూ ఉన్నారు. 

మూడేండ్ల వయసు నుంచే పెద్దలను విసిగించకుండా పిల్లలు పడుకునేందుకు బంకు బెడ్లు తోడ్పడుతాయి. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో వీటి పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇద్దరికీ అతికినట్లు సరిపోయేలా గదిని డిజైన్‌ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇద్దరు పిల్లల్లోనూ ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ‘మేమిద్దరం ఒక్కటే’ అని ఆలోచిస్తారు. ఈ విషయాన్ని నిపుణులే ధ్రువీకరిస్తున్నారు.

పిల్లలకు చక్కగా నప్పుతాయి

 కేవలం బెడ్డుతో సరిపెట్టుకోకుండా చిన్నారుల గదిని ఆధునికంగా, అందంగా తీర్చిదిద్దాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇందుకోసం దాదాపు రూ.1.50 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఖర్చు ఎక్కువైనా ఫర్వాలేదు.. నిర్వహణలో ఇబ్బంది ఉండకూడదని భావించేవారంతా ఇలాంటి అలంకరణ వైపు దృష్టి పెడుతున్నారు. 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -