end

మక్కలో సస్యరక్షణ

రాష్ట్రంలో వరి తర్వాత ప్రధాన పంట అయిన మక్కలో, సస్యరక్షణ చర్యలపై  జయశంకర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించారు. మక్కను ఆశించే పురుగులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వారు వివరించారు.

లద్దె పురుగు : 
  • ఈ పురుగులు ఆకులపై ఉండే పచ్చని పదార్థాన్ని తినడం వల్ల ఆకుల్లో చీరికలు ఏర్పడుతాయి. కండెలను కూడా ఆశించి, పంటను నష్టపరుస్తాయి. దీని నివారణ కోసం..పురుగులు చిన్నగా ఉన్నప్పుడే ఒక లీటరు నీటికి క్వినాల్‌ఫాన్‌ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. 
  • ఎదిగిన లార్వాలను అదుపు చేసేందుకు వరి తవుడు ఐదు కిలోలు, బెల్లం అరకిలో, మోనోక్రోటోఫాస్‌ లేదా క్లోరిపైరిఫాన్‌ 500 మి.లీ. తగినంత నీటిలో కలిపి, ఉండలుగా తయారు చేయాలి. వీటిని సాయంకాలంలో పొలంలో చల్లాలి. లేదా ఒక లీటరు నీటికి థయోడికార్బ్‌ 1 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. 
కాండం తొలుచు పురుగు : 

10 నుంచి 20 రోజుల పైరును ఈ పురుగు  ఆశిస్తుంది. మొక్కలో ఎదిగే అంకురాన్ని లార్వాలు తినడం వల్ల మొవ్వు చనిపోయి, గొడ్డు మొక్కగా మారుతుంది. దీని నివారణ కోసం..

  •  ఒక లీటరు నీటిలో మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా క్లోరాంట్రినిలిప్రోల్‌ 20 ఎస్‌.సీ 0.3 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. 
  •  25 నుంచి 30 రోజుల పైరుకు కార్బోఫ్యూరాన్‌ 3జీ గుళికలను ఎకరానికి మూడు కిలోల చొప్పున మక్క ఆకుల సుడులలో వేయాలి. 
Exit mobile version