సేంద్రియ ఆహారమే మేలు. రోగాలు దరిచేరకుండా ఉండేందుకు సేంద్రియ పంటలే తినాలి. ఆరోగ్యం కోసం ఇంత చేస్తున్నా ప్లాస్టిక్ మాత్రం ప్రజలను వీడటం లేదు. వాటర్ బాటిళ్ల రూపంలో అది మన వెంటే ఉంటున్నది. అలాంటి వాటర్ బాటిళ్లను కూడా సేంద్రియ పద్ధతిలో అందిస్తే ఇక ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదని భావించారు త్రిపురలోని బ్యాంబూ అండ్ క్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు. అంతే, అగర్తలలో వెదురుతో బాటిళ్లను తయారు చేయడం మొదలు పెట్టారు. అవే ఇవి..