end
=
Tuesday, January 21, 2025
బిజినెస్‌ఈస్ట్‌ ఈజ్‌ బెస్ట్‌!
- Advertisment -

ఈస్ట్‌ ఈజ్‌ బెస్ట్‌!

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌ తూర్పు వైపున ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్‌ కారిడార్‌, వరంగల్‌ జాతీయ రహదారి, యాదాద్రి దేవాలయం నగర తూర్పు వైపునే ఉంటాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. కొన్నేళ్లుగా పోచారంలో కార్యకలాపాలను కూడా నిర్వహిస్తున్నది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తూర్పు వైపున ఉన్న ఉప్పల్‌, పోచారం, ఘట్‌కేసర్‌ తదితర ప్రాంతాలకు ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా సులువుగా చేరుకునే వీలు ఉన్నది. నగరంలోని వివిధ ముఖ్య ప్రాంతాల నుంచి అతి తక్కువ సమయంలో ఉప్పల్‌ చేరుకోవడానికి మెట్రోరైలు కూడా అందుబాటులో ఉంది. ఇప్పటికే ఇక్కడ భారీ కమర్షియల్‌ కార్యకలాపాలకు వీలుగా ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. రామంతపూర్‌ నుంచి నార్లపల్లి వరకు దాదాపు 6 కిలో మీటర్ల మేర ఎలివేడెట్‌ వంతెన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఉప్పల్‌ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌ దాకా 2 వందల ఫీట్ల రోడ్డు కూడా అందుబాటులో ఉన్నది. ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు కూడా వెలిశాయి. రాబోయే రోజుల్లో మూసీ వెంట దాదాపు రూ.8 వేల కోట్లతో తూర్పు-పడమర కారిడార్‌ పేరిట ఎలివేటెడ్‌ రహదారి నిర్మాణానికి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌లో ఎంఐసీఈ ( మీటింగ్స్‌, ఇన్‌సెంటివ్స్‌, కల్చర్‌ ఎగ్జిబిషన్‌) అనే ప్రపంచస్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -