తనను విమర్శించే వారి పట్ల అంతే సూటిగా జవాబు ఇస్తుంటుంది నటి త్రిష కృష్ణన్(Trisha krishnan). తప్పుడు కథనాలు(Comments) వ్యాప్తి చేసేవారిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలతో గతంలోనూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందీ సీనియర్ కథానాయకి. వారి తీరును తప్పుపట్టిన త్రిష అలాంటి వారి మాటలు పట్టించుకోనని చెప్పారు. కానీ, సోషల్ మీడియా వేదికగా నెగెటివిటీని వ్యాప్తి చేసేవారిపై త్రిష తాజాగా మరోమారు అసహనం వ్యక్తం చేశారు. ‘విషపూరితమైన వ్యక్తుల్లారా.. అసలు మీరు ఎలా జీవిస్తున్నారు? ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతోంది మీకూ?! ఖాళీగా కూర్చొంటూ ఇతరులను ఉద్దేశించి పిచ్చిపిచ్చి పోస్టులు (Social media)పెట్టడమే మీ పనా? వాస్తవంగా మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తోంది. మీతో కలిసి జీవించేవారి విషయంలో బాధనిపిస్తోంది. నిజం చెప్పాలంటే మీది పిరికితనం. ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా’ అని త్రిష ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. అయితే, త్రిష ఉన్నట్టుండీ ఇలా పోస్టు పెట్టడానికి కారణం లేకపోలేదు. అజిత్ హీరోగా నటించిన ‘గుడ్‌బ్యాడ్‌అగ్లీ’(Good bad ugly) గురువారం విడుదలైంది. ఇందులో త్రిష రోల్‌ను కొంత మంది మెచ్చుకుంటుంగా, మరికొంత మంది ఆమె నటన ఏమీ బాగాలేదంటున్నారు. తమిళం తెలిసినా తన పాత్రకు ఎందుకు డబ్బింగ్ చెప్పుకోలేదని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ నెగెటివిటీపైనే త్రిష స్పందించింది. ఇక త్రిష సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా విడుదలకు సిద్ధమైన ‘విశ్వంభర’లో ఆయనతో జోడీ కడుతోంది. ఇంకా కమల్‌హాసన్‌తో ‘థగ్‌లైఫ్’ చిత్రంలో చేస్తోంది. ‘సూర్య45’తోపాటు ‘రామ్’ అనే మలయాళం సినిమాలోనూ నటిస్తోంది.