end
=
Friday, November 22, 2024
వ్యవసాయంఫ్లవర్‌... పవర్‌!
- Advertisment -

ఫ్లవర్‌… పవర్‌!

- Advertisment -
- Advertisment -

వరంగల్‌ పూలమార్కెట్‌లో ఏఎఫ్‌ఎస్‌ (అన్వర్‌ ఫ్లవర్‌ షాప్‌)కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్నది. తండ్రి అక్రమ్‌ చేస్తున్న పూల వ్యాపారాన్ని మహ్మద్‌ ఖుర్షీద్‌ (అలియాస్‌ అన్వర్‌) చాలా దగ్గరనుంచీ గమనించేవాడు. పదో తరగతి పూర్తయిన వెంటనే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన ఆలోచనలకు తండ్రి అనుభవాన్ని రంగరించి, 20 ఏండ్లుగా పూల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. బెంగళూర్‌, హైదరాబాద్‌, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి పూలు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్‌లో అమ్మేవాడు. వరంగల్‌ సమీపంలోని అక్కంపేట, రెడ్డిపాలెం, పెరుమాండ్లగూడెం, పంథిని, గూడెప్పాడ్‌ చుట్టుపక్కల ఊర్లలో 30 మంది దాకా రైతులు పూల సాగు చేస్తున్నారు. అంతా ఖుర్షీద్‌కే పూలు అమ్మేవారు. పంట పెట్టుబడి కోసం వ్యాపారులే అడ్వాన్స్‌ కూడా ఇచ్చేవారు. ఒక్క ఖుర్షీదే తమకు పూలు అమ్మే రైతులకు ప్రతి నెలా రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా చెల్లించేవాడు. పూలు అమ్మగా వచ్చినదాంట్లో రైతులకు సగం పోగా.. వీరికి సగం మిగిలేది. కొన్ని రకాల పూలను బెంగళూర్‌, పుణెలాంటి నగరాలనుంచి తెప్పించాల్సి వచ్చేది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -