లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో
ఎంఐఎం గెలుపుపై బీజేపీ నేతల స్పందన
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ(HYD local body MLC election) ఎన్నికల ఫలితాలు(Elections results out) శుక్రవారం విడుదలయ్యాయి. ఎన్నికలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ దూరంగా ఉన్నాయి. ఈ నెల 23న ఎన్నిక జరిగింది. ఎంఐఎం తరఫున(MIM contistent) పోటీచేసిన మీర్జా రియాజ్ ఉల్ హాసన్(Mirza riyaz ul Hasan) 63 ఓట్లు సాధించి ఆ స్థానంలో విజయ ఢంకా మోగించారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 112 మంది ఓట్లు ఉండగా.. వీరిలో కార్పరేటర్లు 81 మంది,
ఎక్స్ అఫీషియో సభ్యులు (9 తొమ్మిది మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు) 31 మంది. వీరిలో ఎంఐఎంకు చెందిన ప్రజాప్రతినిధులు 49. మరి ఎంఐఎం అభ్యర్థి 63 ఎలా సాధించారని.. బీజేపీ నేతలు ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తారు. ఆ మిగతా ఓట్లు బీఆర్ ఎస్, కాంగ్రెస్ వాళ్లవేనని ఆరోపిస్తున్నారు. కావాలనే ఆ రెండు పార్టీలు పోటీకి దూరంగా గెలిపించాయని దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాదాల చెంత సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్ ఉన్న గిబ్లీ చిత్రాన్ని వారు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఆ చిత్రంలో గతంలోనే వైరల్‌కాగా, మరోసారి ట్రెండింగ్‌లోకి వస్తున్నది.