end
=
Saturday, January 18, 2025
క్రీడలురోల్‌ మోడల్‌గా నిఖత్ జరీన్..
- Advertisment -

రోల్‌ మోడల్‌గా నిఖత్ జరీన్..

- Advertisment -
- Advertisment -

Nikhat Zareen : నిఖత్ జరీన్..ప్రపంచానికి ఆడపిల్లల పంచ్‌ పవర్‌ ఏంటో చూపించిన తెగువ కలిగిన యువతి. వరల్డ్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్‌ మెడల్ సాధించి జయహో జరీన్ అనిపించుకుంది. దేశానికి, రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఏ ఒక్కరూ పుట్టుకతోనే గొప్పవాళ్లు కాదు. అలాగని ప్రయత్నం చేయకుండా ఓ ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోలేరు. జీవితంలో ఓ లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించుకోవడం అంటే ఎన్నో ఆటుపోటులు, ఎదురుదెబ్బలు,అపజయాలు, చిన్నచూపులు అవమానాలు భరిస్తూ ముందుకెళ్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని నిఖత్‌ జరీన్‌ నిరూపించారు. సమాజంలో ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయ్యే వరకు అడుగడుగున ఆంక్షలు, అణచివేతకు గురి చేసే ఈ సమాజంలో తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతంలో పుట్టి బాక్సింగ్‌లో ప్రపంచ విజేతగా నిలవడం అనేది అంత సులువైన విషయం కాదు. నిజామాబాద్ జిల్లా ఇందూరుకి చెందిన నిఖ‌త్ జరీన్ తన కలను సాకారం చేసుకోవాలని చిన్ననాటి నుంచే ప్రయత్నం చేసింది. ప‌ట్టుద‌ల‌, క్రమశిక్షణతో బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్దిని తన పంచ్‌ పవర్‌తో ఎలా పడగొట్టాలి అని తర్ఫీదు పొందారు.

టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్‌ ఛాంపియన్‌ పోటీల్లో 52కేజీల విభాగంలో థాయ్‌లాండ్ దేశానికి చెందిన జిటింగ్ జుటామస్ పై గెలిచి బంగారు ప‌థ‌కాన్ని సొంతం చేసుకొని దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పింది నిఖత్‌ జరీన్. సీనియర్ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది నిఖత్ జరీన్. నిఖత్ విజయంతో నిజామాబాద్ జిల్లాలోని క్రీడా విభాగం నాయ‌కులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసిన జరీన్‌ ప్రస్తుతం ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ గా మాసబ్ ట్యాంక్ బ్రాంచిలో గతేడాది ఉద్యోగంలో చేరింది. 8వ తరగతి నుంచి తండ్రితో వాకింగ్‌కి వెళ్లిన సమయంలో బాక్సింగ్ కోచ్ షంసముద్దీన్ అబ్బాయిలకు కొచింగ్ ఇవ్వడం చూశారు.తాను కూడా బాక్సింగ్ నేర్చుకుంటానని తండ్రి జ‌మీల్‌ను కోరడంతో కూతురి కోరికను మొదట కష్టంగా భావించినప్పటికి కాదనలేక ఆమెలోని ఆసక్తిని ప్రోత్సహించారు. ఆ ప్రయత్నంలో భాగమే నేడు ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు నిఖత్ జరీన్.ఎన్నో సార్లు కిందపడినా.. దెబ్బలు తగిలినప్పటికి తనలోని ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. లక్ష్యాన్ని విడిచిపెట్టడానికి అంగీకరించలేదు.

రెట్టింపు ఆత్మవిశ్వాసంతో అంచలంచెలుగా ఎదుగుతూ 52కేజీల బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో బంగారు పతకం గెలిచి తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది.2019లో గౌహతిలో జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నిలో క్యాంసం.. 2019లో థాయ్‌ లాండ్ లో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ రజితం.. 2019లో ఇటలీలో జరిగిన బాక్సింగ్ చాంపియన్ షిప్ లో గోల్డ్‌ మెడల్, 2019లో టోక్యో బాక్సింగ్ టోర్నమెంట్‌లో కాంస్యం, 2021 ఇస్తాంబుల్‌ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో కాంస్యం.. 2021లో హరియాణాలో జరిగిన జాతీయ బాక్సింగ్ టోర్నిలో గోల్డ్‌మెడల్‌తో బెస్ట్ బాక్సర్‌గా నిలిచారు. ఆడపిల్లలు చదువులోనే కాదు సాహసాలు, అద్భుతాలు చేయగలరని నిరూపించారు నిఖ‌త్. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు నిఖత్ ఓ స్పూర్తిగా మారారు. ఆశయం, లక్ష్యం పెట్టుకున్న అమ్మాయిలను ప్రోత్సహించే ఇలాంటి అద్భుతాలే సాధిస్తారని చాటి చెప్పారు నిఖత్ జరీన్. నిఖత్‌ సాధించిన విజయానికి ప్రజాప్రతినిధులు కల్వకుంట్ల కవిత,మంత్రి వేముల నగదు బహుమతితో ప్రోత్సహించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -