end

Andhrapradesh:సచివాలయంలో 14వేల పోస్టులు

  • ఫిబ్రవరిలో విడుదలకానున్న నోటిఫికేషన్‌!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీ విషయంలో మరో అడుగు ముందుకేసే పనిలోపడింది. ఇప్పటికే కానిస్టేబుల్ (Constable) నోటిఫికేషన్ ఇవ్వగా వచ్చే ఫిబ్రవరి (February) నెలలో సచివాలయాల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దాదాపు 14 వేలకుపైగా పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తోంది.ఇక వైసీపీ సర్కార్ (YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత… గ్రామ స్థాయిలోనే దాదాపు అన్ని రకాల ప్రభుత్వ సేవలను అందించే ఉద్దేశ్యంలో గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చింది. ఇందుకోసం భర్తీ స్థాయిలో ఉద్యోగాలను రిక్రూట్ (Recruit)చేసింది. రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. అప్పట్లో మిగిలిన ఖాళీలకు 2020లో రెండో విడత నోటిఫికేషన్‌ ఇచ్చి పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి ఇప్పుడు మూడో విడత నోటిఫికేషన్‌ జారీ ప్రక్రియను మొదలు పెట్టింది.

ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే… ఏప్రిల్ లోపు రాత పరీక్షలను నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖ (panchayatraj shaka)కు లేఖ (letter)కూడా రాసింది. అలాగే ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను కూడా ఆ లేఖలో వివరించింది. ఇప్పటివరకు మొత్తం 20 కేటగిరీల ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. దీంతో ఏఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయనే దానిపై స్పష్టత రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (Andhrapradesh State Level Police Recruitment Board) ఆధ్వర్యంలో చేపట్టిన కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాల్ టిక్కెట్లు (Hall ticket)జారీ చేస్తున్నారు. ఏపీలో పోలీస్‌ కానిస్టేబుల్ నియామకాలలో భాగంగా ప్రాథమిక రాత పరీక్షల నిర్వహణకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 3580 సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుల్ పోస్టులతో పాటు 2520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల నియామకాల కోసం గత ఏడాది నవంబర్ 28న నోటీఫికేషన్ విడుదలైంది. మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈ ఏడాది జనవరి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించారు.కానిస్బేబుల్‌ నియామకాల్లో భాగంగా ప్రాథమిక రాత పరీక్షను జనవరి 22వ తేదీన ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనవరి 12 నుంచి 20వ తేదీ వరకు హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

https://slprb.ap.gov.in/

(Scholarship: UG విద్యార్థులకు గుడ్‌న్యూస్)

Exit mobile version