end
=
Wednesday, November 20, 2024
వార్తలుఅంతర్జాతీయంకూతురి కోసం 15 కాన్పులు..
- Advertisment -

కూతురి కోసం 15 కాన్పులు..

- Advertisment -
- Advertisment -

ఈ కాలంలో ఎవరైనా కొడుకు పుట్టాలని కోరుకుంటారు. మగబిడ్డ జన్మించాలని పదుల సంఖ్యలో అమ్మాయిలు పుట్టినా ఆ ప్రయత్నాన్ని విరమించరు. కానీ, ఇందుకు విరుద్దంగా జరిగింది అమెరికాలోని మిచిగాన్‌లో. కూతురు పుట్టాలని పరితపించిన ఓ జంట 14 మంది కుమారులు జన్మించినా.. వారి ప్రయత్నాన్ని మాత్రం ఆపలేరు. ఎట్టకేలకు ఆ దంపతులకు 15వ సంతానంలో కూతురు జన్మించింది. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

వివరాలు చూస్తే.. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన జాయ్, కతేరి దంపతులకు కూతురంటే మహా ఇష్టం. కానీ, వారికి కూతురు జన్మించలేదు. ఎన్నాళ్లంటే.. ఏకంగా 14 మంది కుమారులు పుట్టేంతవరకు. కూతురు కోసం అంతలా పరితపిస్తున్న వారికి ఎట్టకేలకు పదిహేనో సంతానంలో ఆడపిల్ల పుట్టింది. దీంతో, ఆ దంపతులతో పాటు వారి కుమారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ కుటుంబంలోకి మ్యాగీ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం తమకెప్పుడూ ప్రత్యేకంగా ఉండబోతోందని వారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -