end

రేషన్‌ కార్డుపై ఒక్కొక్కరికి 15కేజీల బియ్యం ఉచితం

తెలంగాణలోని రేషన్ కార్డు దారులకు శుభవార్త. ఆగస్ట్ 4వ తేది నుంచి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 15కిలోల చొప్పన బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. పేద ప్రజలకు కేంద్రం గరీబ్‌ కల్యాణ్ యోజన పథకం కింద ప్రతి నెల ఐదు కిలోల చొప్పున ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని ఈనెల 15కిలోలకు పెంచి అందజేస్తున్నారు. తెలంగాణలో ఏప్రిల్, మే నెలల్లో కేంద్రం ప్రభుత్వ కోటా బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణి చేయలేదు. వాటిని సర్దుబాటు చేసే క్రమంలోనే ఈనెల కోటా బియ్యాన్ని పెంచి ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ నెలలో జూలై కోటా కలుపుకొని 15 కిలోల బియ్యాన్ని పాత కార్డుదారులందరికీ పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 15 కిలోలు, కొత్తగా ఈ కార్డులు పొందిన వారికి ఒక్కొక్కరికి 10 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు ఉచితంగా ఇవ్వాలని పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్‌ శుక్రవారం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version