end
=
Sunday, January 19, 2025
సినీమారామ్‌ 'దేవదాసు'కు 15 ఏళ్లు..
- Advertisment -

రామ్‌ ‘దేవదాసు’కు 15 ఏళ్లు..

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ తొలి చిత్రం ‘దేవదాసు’ కు నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. తొలి చిత్రం హిట్ అవడంతో రామ్‌ ఫుల్‌ జోష్‌తో తన కేరీర్‌ను మొదలెట్టాడు. ఈ సందర్భంగా హీరో రామ్‌ సంతోషం వ్యక్తం చేశారు. తనకు దేవదాసుతో సినీ జీవితాన్ని ప్రసాదించిన దర్శకుడు వైవీఎస్‌ చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.’పదిహేనేళ్ల వయసులో టాలీవుడ్‌ అనే స్వర్గంలోకి అడుగు పెట్టాను. దేవదాసు రిలీజై సరిగ్గా పదిహేనేళ్లు అవుతోంది. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాను. ఎంటర్‌టైన్‌ చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను కూడా! అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు. దేవదాసు పోస్టర్‌ను సైతం ట్విట్టర్‌లో పంచుకున్నారు రామ్‌.

దీంతో ఆయన ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేవదాసు నుంచే నీకు అభిమానులమైపోయాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రామ్‌ తాజా చిత్రం ‘రెడ్’‌ జనవరి 14న రిలీజవుతోంది. ఏడు భాషల్లో అనువదించనున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్‌ నటిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -