end

Teaching Jobs : 173 టీచింగ్‌ పోస్టుల భర్తీ

AIIMS Teaching Jobs కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పాట్నలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌(AIIMS) 173 టీచింగ్‌ పోస్టులకి ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌(Job Notification) జారీ చేసింది. అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, డెంటిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎమ్‌ఎస్/ఎమ్‌డీఎస్/డీఎమ్‌/ఎమ్‌సీహెచ్‌ కోర్సులో విజయం సాధించి ఉండాలి.

అలాగే సంబంధిత విభాగంలో మంచి అనుభవం కూడా ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 58 సంవత్సరాలు దాటి ఉండకూడదు. దరఖాస్తు రుసుముగా జనరల్‌ అభ్యర్ధులైతే రూ.1500లు, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఈడబ్ల్యూఎస్ (SC/ST/WOMAN) అభ్యర్ధులకు రూ.1200ల వరకు ఖచ్చితంగా చెల్లించాలి. ఆసక్తి, అర్హత కలిగిన సభ్యులు సెప్టెంబర్‌ 26, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు (Online Job Application) చేసుకోవాలి. అనంతరం నింపిన దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి.

Address: Recruitment Cell All India Institute of Medical Sciences, Phulwarisharif, Patna (Bihar) – 801507.

Exit mobile version