- 24/7 అందుబాటులో ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్
ఆధార్ కార్డు (Aadhar Card)నియంత్రణ సంస్థ యూఐడీఏఐ కస్టమర్ సేవలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్‌కు సంబంధించిన సేవలకు గానూ ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ద్వారా అందించేందుకు 1947ను అందుబాటులో ఉంటుందని పేర్కొంది. దీని ద్వారా ఆధార్ ఎన్రోల్‌మెంట్ లేదా అప్డేట్ స్టేటస్, పీవీసీ కార్డ్ స్టేటస్(Card Status)ను ఎస్ఎంఎస్ లేదా కాల్ ద్వారా తెలుసుకునే సదుపాయం ఉంది. వీటితో పాటు ఫిర్యాదుల స్టేటస్, ఆధార్ నమోదు కేంద్రం వివరాలు కూడా అందించనుంది. ఏ సాంకేతిక తెలియనివారికి 24X7 ఐవీఆర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 2 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లెర్నింగ్ ద్వారా చాట్ సపోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యూఐడీఏఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
(Sports :నేటి నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్)