end
=
Sunday, January 19, 2025
విద్యా సమాచారం2019 సివిల్‌ సర్వీసెస్‌‌ ఫలి‌తాల విడుదల
- Advertisment -

2019 సివిల్‌ సర్వీసెస్‌‌ ఫలి‌తాల విడుదల

- Advertisment -
- Advertisment -

ప్రతిష్టాతకమైన ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ 2019కి సంబంధించిన తుది‌ ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. అందులో 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాకమైన సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది.

ఇందులో 304 జనరల్‌, 78 ఈబీసీ, 254 ఓబీసీ, ఎస్సీ 129, ఎస్టీ 67 మంది ఉన్నారు. కాగా సివిల్‌ సర్వీస్‌ ఫలితాల్లో ప్రదీప్‌ సింగ్‌ మొదటి ర్యాంక్‌, జతిన్‌ కిషోర్‌ రెండో ర్యాంకు, ప్రతిభా వర్మ మూడో ర్యాంక్‌ సాధించారు. కాగా అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.

సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలంగాణ యువకుడు సత్తా చాటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద్‌ ఆలిండియా 110 ర్యాంక్‌ సాధించాడు. ఈ ర్యాంక్‌తో మకరంద్‌కు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. కాగా మకరంద్ తల్లిదండ్రులిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రస్తుతం మకరంద్‌ కుటుంబం సిద్దిపేటలో నివాసం ఉంటుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -