- ట్విటర్ వేదికగా వెల్లడించిన ఐపీఎల్ నిర్వాహకులు
Sports :
ఐపీఎల్ 2023 (IPL2023) ఎడిషన్‌లో ఒక సరికొత్త నిబంధన అమల్లోకి రాబోతోంది. జట్లు మ్యాచ్‌పై (Match) మరింత ప్రభావం చూపేలా ఒక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ (Substitute player)ను ఆడించుకోవచ్చు. ఇదే విషయాన్ని అన్ని జట్ల యాజమాన్యాలకు తెలియజేసినట్టు ట్విటర్ (Tweet) వేదికగా ఐపీఎల్ (IPL) నిర్వాహకులు వెల్లడించారు. ‘‘ టాటా ఐపీఎల్ 2023 (TATA IPL2023) సీజన్ నుంచి ఒక వ్యూహాత్మక భావనను ప్రవేశపెట్టి ఐపీఎల్‌కు సరికొత్త ప్రమాణాన్ని జోడించబోతున్నాం. నిబంధన ప్రకారం.. మ్యాచ్‌లో ప్రతి జట్టుకి ఒక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ కీలకపాత్ర పోషించవచ్చు’’ అని నిర్వాహకులు పేర్కొన్నారు. కొత్త సీజన్ (New season) ఆసన్నమవుతోందని, కొత్త నిబంధన ప్రవేశపెట్టాల్సిన సమయమొచ్చిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
అయితే ఈ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ని టీమ్‌లు ఏవిధంగా ఉపయోగించుకోవాలనేదానిపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. కాగా ఈ రూల్ (Rules)ని ఇప్పటికే ఈ సీజన్ ‘సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీ’లో (SMAT) ఉపయోగిస్తున్నారు. ఇక్కడి ఫాలోఅవుతున్న నిబంధనల ప్రకారం.. టీమ్ షీటులో జట్లు నలుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లను సూచించవచ్చు. వీరిలో ఎవరినైనా ఒకరిని ఉపయోగించుకోవచ్చు. ఈ ఆటగాడిని ‘ఇంపాక్ట్ ప్లేయర్’ (‘Impact Player’) అని పిలుస్తారు. ఇరు జట్ల ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్‌కు ముందు జట్టులోని ఏ ఆటగాడినైనా ఇంపాక్ట్ ప్లేయర్‌తో సబ్‌స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఉపయోగించడం ద్వారా మ్యాచ్‌పై జట్లు ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అప్పటికే బ్యాట్స్‌మెన్ అవుటైనా, బ్యాటింగ్ చేస్తున్నా అతడి స్థానంలో మరో ప్లేయర్‌ని ఆడించవచ్చు. బౌలింగ్ విషయంలో ఇంతే.. కొన్ని ఓవర్లు వేసిన, అప్పటికే 4 ఓవర్లు పూర్తిచేసిన బౌలర్ (Bowler)స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకోవచ్చనేది సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీలో కొనసాగుతున్న నిబంధన.
ఇక 2005, 2006 సంవత్సరాల్లో వన్డేల్లో సూపర్‌సబ్ సిస్టమ్ (Supersub system in ODIs) నిబంధన ఉండేది. దాంట్లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఒక పాత్ర మాత్రమే పోషించాలి. బ్యాటర్ స్థానాన్ని రిప్లేస్ (Replace) చేస్తే బౌలింగ్ మాత్రమే చేయాలి. బ్యాటింగ్ చేయడానికి వీల్లేదు. రెండవ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసుకోవచ్చు. అయితే ఐపీఎల్ 2023లో ప్రవేశపెట్టబోయే సబ్‌స్టిట్యూట్ నిబంధనను ఏవిధంగా అమలు చేయబోతున్నారో వేచిచూడాలి.