end

25 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్స్‌..

హైదరాబాద్‌: ఈ నెల 25 నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరగనున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు కీలక ప్రకటన చేశారు. షెడ్యూల్‌ ప్రకారం 23 నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగాల్సి ఉండగా.. కోర్టులో విచారణ ఉన్నందున సాధ్యం కాలేదన్నారు సీఎం. 25 నుంచి కచ్చితంగా ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు అందరూ సిద్దంగా ఉండాలని సీఎం సూచించారు. గ్రామాలు, పట్టాణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు ముందే నిర్ణయించారని, వాటిని మార్చే విచక్షణాధికారం ఎవరికీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ యదావిధిగా కొనసాగుతోంది.

Exit mobile version