- ప్రభుత్వం తరపున సాకారం అందిస్తామన్న కేటీఆర్
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు గోద్రేజ్ ఆగ్రోవెట్ సంస్థ (Godrej Agrovet Company) ముందుకొచ్చింది. ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ముందుకొస్తున్న తరుణంలో గోద్రేజ్ భారీ బడ్జెట్ కేటాయించేందుకు మొగ్గుచూపుతోంది. అంతేకాదు ఇప్పటికే చాలా సంస్థలు తెలంగాణ సర్కార్ ఒప్పందం కూడా కుదుర్చుకోగా.. తాజాగా గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ మొత్తం రూ. 250 కోట్లతో వంటనూనె ప్రాసెసింగ్ ప్లాంట్ (Cooking Oil Processing Plant)ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ (State IT Minister KTR)ను గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బలరామ్‌సింగ్ యాదవ్ (MD Balram Singh Yadav)కలిసి పెట్టుబడుల అంశంపై వివరంగా డిష్కస్ చేసినట్లు తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కంపెనీగా పేరుగాంచిన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (The largest oil palm plantation company is Godrej Agrovet Ltd) తెలంగాణలో రూ.250 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండగా.. గంటకు 30 టన్నుల (TPH) ప్లాంట్‌ను 60 TPH వరకు విస్తరించవచ్చు. ఇక ఖమ్మం జిల్లాలో ఈ ప్లాంట్‌ని ఏర్పాటు చేయనుండగా.. ఖమ్మం జిల్లాలో ఇదే అతిపెద్ద ప్రైవేట్ పెట్టుబడిగా నిలవనుంది. ఈ సందర్భంగా గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ సింగ్ యాదవ్ హైదరాబాద్‌లో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావుతో సమావేశమై పెట్టుబడుల ప్రణాళికలను తెలియజేశారు. వివిధ వ్యాపార రంగాలలో పరిశీలనలో ఉన్న అనేక కార్యక్రమాలలో ఇదొకటి అని ఆయన మంత్రికి హామీ ఇచ్చారు.

అలాగే ఈ ప్లాంట్ ఫలితంగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో సాగవుతున్న పామ్ ఆయిల్ పంట ఉత్పత్తులను ప్రాసెస్ (Processing of palm oil crop products) చేసేందుకు వీలు కలుగుతుందని వెల్లడించారు. 2025-26లో ప్లాంట్ కార్యకలాపాలను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. పామ్‌ఆయిల్ రైతుల కోసం పది గోద్రెజ్ సమాధాన్ సెంటర్లను (Godrej Samadhan Centres) ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాజాగా ఏర్పాటయ్యే ప్లాంట్ ద్వారా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో (Khammam and Kothagudem districts)ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి (Employment and employment for 250 people and indirectly another 500 people) లభిస్తుందని గోద్రెజ్ ఆగ్రోవెట్ ప్రతినిధులు చెప్పారు. శాటిలైట్, డ్రోన్‌ల ద్వారా సాగు విస్తీర్ణా (Cultivated area by satellite, drones)న్ని పర్యవేక్షించడంతో పాటు వేర్వేరు యాప్‌ల ద్వారా రైతులకు సేవలు (Services to farmers through different apps) అందించనున్నట్లు వివరించారు. గోద్రేజ్ సంస్థ పెట్టుబడులపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పామ్ ఆయిల్ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సంస్థ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం తరపున కావాల్సిన సాకారం అందిస్తామని హామీనిచ్చారు.
గోద్రెజ్ అగ్రోవెట్ ప్రతిపాదిత సదుపాయంలో 2025-26 నాటికి పూర్తి స్థాయిలో పనిచేయాలని యోచిస్తోంది. కో-జనరేషన్ ప్లాంట్ (Co-generation plant)తో కర్మాగారం విద్యుత్ (Factory electricity) అవసరాలలో స్వయం సమృద్ధిగా ఉంటుంది. పామాయిల్ రైతులకు 10 గోద్రెజ్ సమాధాన్ కేంద్రాలు, వారి విస్తరణ బృందం ద్వారా సేవలు అందించబడతాయి. ప్రస్తుతం గోద్రేజ్ తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం (Khammam, Bhadradri Kothagudem) జిల్లాల్లోని 10 మండలాల్లో ఉంది.
ఇక ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో గోద్రేజ్ ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ వ్యాపారం, ప్రాసెసింగ్ సౌకర్యం (Godrej Agrovet Oil Palm Trading, Processing in Khammam, Kothagudem District)తో సహా 250 మంది సభ్యులు (ప్రత్యక్ష ఉపాధి), 500 మంది సభ్యుల (పరోక్ష ఉపాధి) ఉపాధి కల్పనకు దారి తీస్తుందని అభిప్రాయపడుతుండగా.. మొత్తం రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ (20 lakh acres of palm oil plantation)ను విస్తరించాలని తెలంగాణ ప్రతిష్టాత్మకంగా లక్ష్యంగా పెట్టుకుంది. దిగుమతి చేసుకున్న చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ తోటల (Palm oil plantations)ను దూకుడుగా ప్రోత్సహిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా, రాష్ట్ర ప్రభుత్వం దూకుడు ఫలితంగా తెలంగాణలో పసుపు విప్లవంతోపాటు నూనె గింజల ఉత్పత్తిలో పెరుగుదల ఏర్పడిందని (Along with the yellow revolution there was an increase in the production of oilseeds)అధికారులు వెల్లడిస్తున్నారు.