end
=
Thursday, November 21, 2024
వార్తలుఅంతర్జాతీయం37 లక్షలకు చేరిన పాజిటీవ్ కేసులు
- Advertisment -

37 లక్షలకు చేరిన పాజిటీవ్ కేసులు

- Advertisment -
- Advertisment -
  • చైనాను మరోసారి వణికిస్తున్న కోవిడ్ బీభత్సం
  • రోజుకు 10 లక్షలు పాజిటీవ్, 5వేల మరణాలు
  • ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ తాజా అధ్యయనం వెల్లడి

covid : చైనాలో (China) మళ్లీ పెరుగుతన్న కరోనా (Covid case) కేసులు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుత కోవిడ్ వేవ్ విజృంభణను చూస్తుంటే జనవరిలో లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. లండన్‌కి చెందిన ఇన్ఫినిటీ లిమిటెడ్ పరిశోధనా సంస్థ (London-based Infinity Limited is a research firm)తాజా శోధనను గమనిస్తే 140 కోట్ల జనాభా కలిగిన చైనా పరిస్థితి రాబోయే మూడునెలల్లో ఘోరంగా మారనుందని తెలుస్తోంది. అతి త్వరలోనే చైనాలో రోజుకు పదిలక్షల కరోనా కేసులు, 5 వేల మరణాలు సంభవించే అవకాశముందని ఈ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచం ఇంతవరకు ఎరగని అతిపెద్ద వైరస్ (virus)వ్యాప్తిగా నమోదవుతుందని అంచనా. ప్రస్తుత కోవిడ్ వేవ్ ఇలాగే కొనసాగితే 2023 జనవరి నెలలోనే రోజుకు 37 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదముందని సూచించింది.

ఆరోగ్య విశ్లేషణల అంచనాపై దృష్టపెడుతున్న ఎయిర్‌ఫినిటీ సంస్థ (Airfinity Corporation) కరోనా మహమ్మారి మొదలైనప్పటినుంచి దాని జాడను, గమనాన్ని పసిగడుతూనే ఉంది. గత మూడేళ్ల పరిశీలనా అనుభవం బట్టి చూస్తే 2023 మార్చి నెలలో చైనాలో రోజుకు 42 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదముందని ఈ సంస్థ అంచనా వేసింది. డిసెంబర్ ప్రారంభం నుంచి చూస్తే ప్రస్తుతానికి చైనాలో రోజుకు 2,966 వైరస్ కేసులు అధికారికంగా నమోదువుతున్నాయి.

రోజుకు పది కంటే తక్కువ కరోనా సంబంధ మరణాలు నమోదవుతున్నాయి. కానీ ఉన్నట్లుండి చైనాలో ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయని, స్మశానవాటికలకు శవాలు వెల్లువెత్తుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో అతిత్వరలో దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షల్లోకి మారే అవకాశం లేకపోలేదని ఈ నివేదిక తెలిపింది

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -