end

Nirmala Sitharaman:48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Harish Rao). ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పలు విజ్ఞప్తులను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. జీఎస్టీ(GST) నుండి మినహాయింపులు ఇవ్వాలని కోరారు.

1, తెలంగాణలో మైనర్ ఇరిగేషన్(Minor Irrigation) కింద 46 వేల జలాశయాలు ఉన్నాయి. వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. అయితే ప్రతి ఏడాది వీటి నిర్వహణ చేయడం ఎంతో ముఖ్యం. ఈ పనులు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తున్నది. ఈ నిర్వహణ, మరమ్మతుల పనులను జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వండి అని కోరడం జరిగింది.

2, పిడిఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్(Transport) సేవలుకు జిఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలనీ, పేదలకు అందించే ఈ సేవలపై జీఎస్టీ వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నదనీ, అందువల్ల జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

3, బీడీ ఆకుపై పన్ను వేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. గిరిజన, పేద, మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో మంది బీడీలు తయారీ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే కేంద్రం బీడీ లపై 28 శాతం జీఎస్టీ వేయడం జరిగింది. దీన్ని గతంలో మేము తీవ్రంగా వ్యతిరేకించాము. బీడీ ముడిసరుకు(raw material) అయిన ఆకులపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వేయడం పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. అందువల్ల మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు కోరారు.

4, టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ ప్రపోజల్(praposal) స్వాగతిస్తున్నాము. అయితే దీనిపై ఉన్న సంశయాలను కౌన్సిల్ దృష్టికి తెస్తున్నాం. ముఖ్యంగా టెలికాం సేవలకు సంబంధించి, ట్రాయ్ రూల్స్ వల్ల కస్టమర్ అడ్రస్, పిన్ నెంబర్ పే టీఎం, మోబి క్విక్, బిల్ డెస్క్ తదితర ఆన్లైన్ వ్యాపార సంస్థల వద్ద ఉండే అవకాశం ఉండదు. దీని వల్ల వినియోగదారులు ఉన్న రాష్ట్రాల ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు చేయాలి అని కోరుతున్నాం.

మైనర్ ఇరిగేషన్, పిడిఎస్ సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, బీడీ ఆకులపై జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలని కోరిన తెలంగాణ ప్రభుత్వ(Telangana Govt) విజ్ఞప్తులపై జీఎస్టీ పూర్తి పరిశీలన నిమిత్తం ఫిట్ మెంట్ కమిటీకి సిఫార్సు చేస్తూ, ఆదేశించింది. టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వెల్లడించారు.బి అర్ కే భవన్ నుండి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ సోమేష్ కుమార్, కమిషనర్ కమర్షియల్ టాక్స్ నీతూ ప్రసాద్, వాణిజ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

(Harish Rao:తెలంగాణ ప్రభుత్వం కొండంత అండ ఇస్తున్నది)

Exit mobile version