end

Delhi:ఢిల్లీలో 50వేల మంది రైతుల నిరసన

  • ‘రామ్‌లీలా’లో ‘కిసాన్ గర్జన’
  • ‘బీకేఎస్’ పిలుపుతో తరలివచ్చిన రైతులు
  • కేంద్రం హామీలను నెరవేర్చాలని డిమాండ్


దేశ రాజధాని ఢిల్లీలోని (delhi) రామ్ లీలా మైదానం (Ramleela ground)లో సోమవారం 50 వేల మంది రైతులు(formers)కిసాన్ గర్జన (Kisan Garjana) చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న రైతుల డిమాండ్లను నేరవేర్చాలని రైతులు మరోసారి నిరసనకు దిగారు. ఆరెస్సెస్ (RSS) అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ (Bharatiya Kisan Sangh) పిలుపు మేరకు భారీగా రైతులు తరలివచ్చారు. సాగు చట్టాల రద్దు సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నేరవేర్చలాని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా పంటలకు కనీస మద్ధతు ధర కల్పించాలని వారు కోరారు. డిమాండ్లు నేరవేరుస్తామని హామీ ఇచ్చి దాదాపు ఏడాది గడుస్తున్న ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయలేదని రైతు సంఘాలు తెలిపాయి. ఒకవేళ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేక పోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బీకేఎస్ (BSK) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీ (MODI)వాగ్ధానాలు శూన్యమేనని నిర్ధారణ అయ్యాయని బీకేఎస్ జనరల్ సెక్రటరీ మోహిని మోహన్ (BKS General Secretary Mohini Mohan) అన్నారు. వ్యవసాయ సామగ్రి, ఎరువులపై జీఎస్టీ (GST)తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే ప్రతి ఏటా కేంద్రం రైతులకు ఇచ్చే రూ.6,000లను రెట్టింపు చేయాలని కోరారు. రైతులు నైపుణ్యం ఉన్న శ్రామికులని కనీస గౌరవం ఇవ్వాలని అన్నారు. కాగా.. 560 జిల్లాల్లోని 60వేల గ్రామాల్లో ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని బీకేఎస్ తెలిపింది. 20వేలకు పైగా పాదయాత్రలు, 13వేలకు పైగా సైకిల్ యాత్రలు, 18వేల సమావేశాలు నిర్వహించామని తెలిపింది. కిసాన్ గర్జనను దృష్టిలో పెట్టుకుని అధికారులు ట్రాఫిక్ అంక్షలు అమలు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ చీఫ్ ప్రధాని మోడీని అప్రమత్తం చేశారు. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన హామీలను నేరవేర్చాలని ఆయన సూచించారు.

(Rohith Reddy:బండి సంజయ్‌కి రోహిత్ రెడ్డి సవాల్)

బీకేఎస్ ప్రధాన డిమాండ్లు ఇవే..

  1. అన్ని వ్యవసాయ ఉత్పత్తులపై లాభాన్ని ఇచ్చే ధరలు. 2. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపు. 3. కిసాన్ సమ్మాన్ నిధి ఆర్థిక సహాకారం పెంపు
  2. జన్యు రూపాంతర విత్తనాలను ఆమోదించొద్దు. 5 రైతుల ప్రయోజనాల మేరకు ఎగుమతి దిగుమతి, విధానం. 6. రైతుల ట్రాక్టర్లకు 15 ఏళ్ల వాహాన తుక్కు పాలసీ మినహాయింపు

Exit mobile version