end
=
Thursday, September 19, 2024
వార్తలురాష్ట్రీయంSmoking:సెకండ్ హ్యాండ్ స్మోక్ తో ఆరోగ్య రంగంపై రూ.5670 కోట్ల భారం
- Advertisment -

Smoking:సెకండ్ హ్యాండ్ స్మోక్ తో ఆరోగ్య రంగంపై రూ.5670 కోట్ల భారం

- Advertisment -
- Advertisment -
  • దేశ ఆరోగ్య సంర‌క్ష‌ణ బ‌డ్జెట్ లో 8 శాతానికి స‌మానం
  • హెచ్చ‌రించిన‌ తాజా  అధ్య‌య‌నం


పొగ తాగేవారే కాదు.. వారు వ‌దిలిన పొగ‌ను పీల్చిన(Inhaled) వారికి కూడా ప్రాణాంత‌కంగా మారుతోంది. ఇలా సెకండ్ హ్యాండ్ పొగ పీల్చి(Inhaling second-hand smoke) అనారోగ్యం బారిన ప‌డుతున్న‌వారు చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తోంద‌ని తాజా అధ్య‌య‌నంలో తేలింది. సెకండ్ హ్యాండ్ పొగ పీల్చిన‌వారు చికిత్స కోసం ప్ర‌తి సంవ‌త్స‌రం ఏకంగా రూ.5670 కోట్ల ఖ‌ర్చు చేస్తున్నార‌ని వెల్ల‌డించింది. ఇది దేశ ఆరోగ్య రంగ బ‌డ్జెట్ లో 8 శాతానికి స‌మానం. మొత్తంగా పొగాకు వినియోగం వ‌ల్ల ప్ర‌తి సంవ‌త్స‌రం రూ.17,734 కోట్ల మేర న‌ష్టం క‌లుగుతున్న‌ట్టు ఈ అధ్య‌య‌నంలో తేలింది. దేశంలో ఇలా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ పై అధ్య‌య‌నం జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. కేర‌ళ‌(Kerala)లోని కొచ్చిలో ఉన్న రాజ‌గిరి కాలేజ్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ కు చెందిన ప‌రిశోధ‌కుల బృందం నేతృత్వంలో ఈ అధ్య‌య‌నం సాగింది. 15 సంవ‌త్స‌రాల వ‌య‌సుకు పైబ‌డి పొగ‌తాగే అల‌వాటు లేనివారిపై వారు అధ్య‌య‌నం చేశారు. సెకండ్ హ్యాండ్ పొగ పీల్చి అనారోగ్యం పాల‌వ‌డం వ‌ల్ల ఎదుర‌వుతున్న తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు, చికిత్స‌కు చేసే ఖ‌ర్చు, న‌ష్ట‌పోతున్న ఉత్పాద‌క శ‌క్తి, మ‌ర‌ణాలు వంటి విష‌యాల్లో లోతుగా అధ్య‌య‌నం చేసి ఈ నివేదిక‌ను రూపొందించారు.

“సెకండ్ హ్యాండ్ పొగ పీల్చ‌డం వ‌ల్ల అటు ఆరోగ్యం పాడ‌వ‌డంతోపాటు ఇటు వైద్య రంగంపై(On the medical field) తీవ్ర ఒత్తిడి ప‌డుతోంది. ముఖ్యంగా పేద వ‌ర్గాల‌కు చెందిన‌ మ‌హిళ‌లు, యువ‌త‌, చిన్న‌పిల్ల‌లే ఎక్కువ‌గా బాధితులుగా ఉంటున్నారు. ప్ర‌భుత్వాలు వెంట‌నే మేల్కొని చ‌ర్య‌లు తీసుకోకుంటే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వు” అని ఈ ప‌రిశోధ‌న‌(Research)కు నేతృత్వం వ‌హించిన రాజ‌గిరి కాలేజ్ ఆఫ్ సైన్స్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ రిజో జాన్(Dr. Rijo John) హెచ్చ‌రించారు.”దేశంలో పొగ తాగేవాళ్లు ఎక్కువ‌గా ఉన్నారు. విచ్చ‌లవిడిగా బ‌హిరంగంగా పొగ తాగుతున్నారు. ధూమ‌పానం వ‌ల్ల ఆరోగ్య ప‌రంగా, ఆర్థికంగా తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. దేశంలో పొగాకు వినియోగాన్ని త‌గ్గించ‌గ‌లిగితే ల‌క్ష‌లాది మంది ప్రాణాల‌ను కాపాడ‌వ‌చ్చు. ఇందుకు క‌ఠిన చ‌ట్టాలు అవ‌స‌రం. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో పొగ తాగ‌డంపై ఉన్న నిషేదాన్ని క‌ఠినంగా అమ‌లు చేయాలి. పొగాకు ఉత్ప‌త్తుల‌పై ప‌న్నులు పెంచాలి. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి” అని సోమాజి గూడ‌లోని య‌శోద హాస్పిట‌ల్ కు చెందిన స‌ర్జిక‌ల్ ఆంకాల‌జిస్ట్ డాక్ట‌ర్ కే సూర్య‌కాంత్ అన్నారు.

“పొగాకు నియంత్ర‌ణ‌(Tobacco control)కు ప్ర‌తిపాదించిన COT PA 2003 ని అమ‌లు చేయాల‌ని, ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడాల‌ని నేను కేంద్ర ప్ర‌భుత్వానికి అనేక‌సార్లు విన్న‌వించాను. త‌ద్వారా ప్ర‌జారోగ్యాన్ని కాపాడ‌వ‌చ్చ‌ని కోరాను. దేశాన్ని వంద శాతం ధూమ‌పాన ర‌హితంగా మార్చి, ల‌క్ష‌లాది మంది ప్రాణాల‌ను కాపాడ‌టానికి వెంట‌నే చ‌ర్య‌లు ప్రారంభించాలి “అని వాలంట‌రీ హెల్త్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా(Voluntary Health Association of India), స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ‌ర్ డాక్ట‌ర్ వెంక‌ట రావు అన్నారు.

  • దేశంలో పొగ తాగేవాళ్లు 10 కోట్లు. ప్ర‌పంచంలోనే రెండో స్థానం(Second Place).
  • ఏటా 12 ల‌క్ష‌ల మంది పొగాకు సంబంధ వ్యాధుల‌తో మ‌ర‌ణిస్తున్నారు.
  • ఇందులో పొగ పీల్చ‌డం వ‌ల్ల ల‌క్ష మర‌ణాలు సంభ‌విస్తున్నాయి.
  • సెకండ్ హ్యాండ్ స్మోక్ వ‌ల్ల ప్ర‌తి సంవ‌త్స‌రం 2 ల‌క్ష‌ల మంది ప్ర‌భావితం అవుతున్నారు.
  • దేశంలో క్యాన్స‌ర్(Cancer) రోగులు పెర‌గ‌డంలో 27 శాతం పొగాకే కార‌ణం.
  • పొగాకు వ‌ల్ల ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా క‌లుగుతున్న న‌ష్టం 1.82 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు. ఇది దేశ జీడీపీలో 1.8 శాతానికి స‌మానం.

(MV Ganga Vilas:భారతదేశ మొదటి నదీ పర్యటక నౌక)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -