end
=
Friday, February 21, 2025
- Advertisment -

ఈనెలలోనే 5G లాంచ్

- Advertisment -
- Advertisment -

ఎయిర్‌టెల్‌ 5జీ రోల్ అవుట్ కూడా ఈనెలలో మొదలుకానుంది. ఈ విషయాన్ని ఆ టెలికం సంస్థ అధికారికంగా ప్రకటించింది. 5జీ సేవల కోసం సామ్‌సంగ్‌తో పాటు మరో మూడు కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌ దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను లాంచ్ చేసేందుకు ప్రిపేర్ అయింది. ఓవైపు రిలయన్స్ జియో కూడా ఈనెలలో 5జీ రోల్అవుట్‌ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ తరుణంలోనే ఎయిర్‌టెల్‌ కూడా 5G రేస్‌లో ముందుండేందుకు రెడీ అయింది. ఇందుకోసం బుధవారం ఒప్పందాలను కూడా చేసుకుంది. దేశంలో 5జీ సర్వీస్‌లను అందించేందుకు టెలికం ఎక్విప్‌మెంట్ ప్రధాన సంస్థలైన ఎరిక్‌సన్ , నోకియా , సామ్‌సంగ్‌ లతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్‌ అధికారికంగా ప్రకటించింది.

19,868 MHz ఎయిర్‌వేవ్స్ కోసం వేలంలో రూ.43,084 కోట్లను ఎయిర్‌టెల్‌ వెచ్చింది. ఇందులో కీలకమైన 3.5 GHz, 26 GHz బ్యాండ్స్ కూడా ఉన్నాయి. కాగా ఈ వేలంలో 24,740 MHz ఎయిర్‌వేవ్స్‌ను రూ.88,078 కోట్లకు దక్కించుకున్న జియో అగ్రస్థానంలో అత్యధిక బ్యాండ్స్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 5జీ రోల్అవుట్ గురించి ఎయిర్‌టెల్‌ అఫీషియల్ స్టేట్‌మెంట్ విడుదల చేసి వివరాలను వెల్లడించింది.

ఎయిర్‌టెల్‌తో సామ్‌సంగ్‌ జత కట్టడం ఇదే తొలిసారి. ముందుగా దేశంలోని 12 ప్రధాన నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇంతకాలం 4జీ నెట్‌వర్క్ కోసం జియోతో కలిసి సామ్‌సంగ్‌ పని చేసింది. భారత 5Gలో చైనా సంస్థల భాగస్వామ్యం ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించడంతో జెడ్‌టీఈని పక్కన పెట్టింది ఎయిర్‌టెల్‌. మరోవైపు రిలయన్స్ జియో కూడా ఇదే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. జియో కొత్త చైర్మన్ ఆకాశ్ అంబానీ ఇదే దిశగా సంకేతాలు ఇచ్చారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను 5జీ రోల్అవుట్‌తో సంబరం చేసుకుందామని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంపై జియో అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. 5జీ రోల్అవుట్ కోసం నోకియా, ఎరిక్‌సన్‌తో జియో చర్చిస్తోందని తెలుస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -