కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ లోని డిసిపి కార్యాలయంలో బాలానగర్ జోన్ డిసిపి సందీప్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలానగర్ ఎస్ ఓ టి & శామీర్ పేట్ పోలీసుల అధ్వర్యంలో నిషేదిత గంజాయి సప్లై చేస్తున్న 6గురి నింధితులను అరెస్టు చేశారని, వీరి వద్ద నుండి 350కేజీ నిషేధిత గంజాయి, 2 కార్లు, 6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ సుమారు 80 లక్షల వరకు ఉంటుంది. 6గురి నింధితులు ఒరిస్సా మహారాష్ట్ర కి చెందినవారు.
ఒరిస్సా లోని శేర్పల్లి గ్రామం నుండి సోలాపుర్ కి వయా హైదరాబాద్ మీదుగా సప్లై చేస్తుంటారని, పోలీసులు నిఘా వేసి, పక్కా సమాచారంతో నేడు ఓ ఆర్ ఆర్ పై గంజాయి లోడ్ తో వెళ్తున్నా మహేంద్ర బోలేరో వాహనాన్ని పట్టుకొని 6గురి నింధితులని అరెస్టు చేసి రిమాండ్ కి తరలిస్తున్నామని డిసిపి తెలిపారు. వీరు ఈజీ మనీ కోసం రూ.1500కేజి కొని అవసరం ఉన్నవారికి రూ. 20000 అమ్ముతున్నామని డిసిపి కి తెలిపారు.