end
=
Saturday, January 18, 2025
వార్తలుఅంతర్జాతీయంChina:ఒకే నెలలో 60 వేల మంది మృతి
- Advertisment -

China:ఒకే నెలలో 60 వేల మంది మృతి

- Advertisment -
- Advertisment -
  • చైనాలో బీభత్సం సృష్టిస్తున్న కరోనా

చైనాలో (China) మరోసారి కరోనా (COVID) బీభత్సం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా గత రెండేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి కోట్ల సంఖ్యలోనే మనుషుల ప్రాణాలు బలితీసుకుంది. అయితే ఈ డెత్ కౌంట్ (deth count)పై పలు దేశాలు లెక్కలు వెల్లడించినప్పటికీ దాదాపు అన్నీ అసంపూర్తిగానే ఉన్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (world health organization) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే గత డిసెంబర్‌లో కోవిడ్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా చైనా మృతుల సంఖ్యను వెల్లడించింది. నెల రోజుల సమయంలో 60 వేల మంది కోవిడ్ సంబంధిత రోగులు మృతి చెందారని చైనా ఆరోగ్య శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. 2022 డిసెంబర్ 8 నుంచి ఈ ఏడాది జనవరి 12వ తేదీ మధ్యలో 59,938 మంది చనిపోయినట్టు జాతీయ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్ జియావో యహుయ్ (Xiao Yahui, chairman of the Bureau of Medical Administration under the National Health Commission) చెప్పారు.

అయితే ఈ మృతుల సంఖ్య వైద్యం అందినవారిది మాత్రమే. కాగా లెక్కలోని రాని వారిని కలిపితే మృతు సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మొత్తం మృతులలో 5,503 మంది శ్వాస కోశ సంబంధిత బాధతో చనిపోయారు. మిగిలిన 54,435 మంది కోవిడ్ సంబంధ వ్యాధులతో చనిపోయారని జియావో తెలిపారు. గత డిసెంబర్ (December) నుంచి కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో ఆ దేశంలో మృతుల సంఖ్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృతుల ఖచ్చితమైన సంఖ్యను బయటికి చెప్పడం అవసరం లేదని వైద్యాధికారులు బుధవారం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ మరణాలను లెక్కించేందుకు చైనా ఒక ప్రత్యేక పద్దతిని అనుసరించింది. వైరస్ వల్ల శ్వాస ఆడక చనిపోయిన వారిని మాత్రమే లెక్కిస్తామని వైద్యాధికారులు చెప్పారు.

అయితే చైనా పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO).. ఇది సంకుచిత మనస్తత్వమని నిర్వచించింది. ‘వైరస్ (virus)తో ఆస్పత్రులలో (hospital) చేరిన వారి సంఖ్య, మృతుల సంఖ్యను నిజాయితీగా, క్రమం తప్పకుండా ఇవ్వాలని చైనాను మా సంస్థ నిరంతం కోరుతూనే ఉంది’ అని హూ చైర్మన్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ (Who is the chairman Tedros Adhanom Ghebreyesus) చెప్పారు. అయితే సగటున 80.3 వయసున్న వారు చనిపోయారని శనివారం చైనా వైద్యాధికారులు చెప్పారు. 90 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారే అని తెలపడం విశేషం. కాగా ఈ లెక్కలు కూడా సరిగా ఉన్నాయోలేవోననే అనుమానం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

(Corona:మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -