end
=
Wednesday, November 20, 2024
క్రీడలుCricket:తొలి వన్డే దక్షిణాఫ్రికాదే..
- Advertisment -

Cricket:తొలి వన్డే దక్షిణాఫ్రికాదే..

- Advertisment -
- Advertisment -

  • 9 పరుగుల తేడాతో ఓడిన భారత్
  • సంజు శాంసన్ పోరాటం వృథా


ఇండియా-దక్షిణాఫ్రికా (India vs South africa)ల మధ్య లక్నో (Lucknow) వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. వర్షం (Rain) కారణంగా 40 ఓవర్లకు కుదించిన తొలి మ్యాచ్‌లో సఫారీలు అద్భత పోరాటపటిమతో విజయాన్ని (Won the match) నమోదు చేసుకున్నారు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా 40 ఓవర్లకు 4 వికెట్లను కోల్పోయి 249 పరుగులు చేయగా.. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని (Target) టీమిండియా ముంగిట నిలిపింది. డేవిడ్ మిల్లర్ (miller)(75), హెన్రిచ్ క్లాసెన్ (clasen) (74) అజేయ అర్థ సెంచరీలతో దక్షిణాఫ్రికా స్కోరు (score board) బోర్డును పరుగులు పెట్టించారు. ఐదో వికెట్ భాగస్వామ్యానికి డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ 139 పరుగులు (partnership) జత చేశారు. డికాక్ (dicock) ఔటైన తర్వాత దూకుడుగా ఆడిన క్లాసెన్ పరుగుల వేగం పెంచాడు. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించిన క్యాచ్‌లను చేజార్చడం టీమ్ ఇండియా పాలిట శాపమైంది. ఫలితంగా దక్షిణాఫ్రికా చేతితో 9 పరుగుల (9runs)తేడాతో పరజయాన్ని చవిచూసింది.

(T20 Ranks :ఇండియానే నంబర్ 1)

ఇక బలమైన బ్యాటింగ్ (Batting) లైనప్ కలిగివున్న భారత్ (india) 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ.. 8 పరుగులకే శుభ్ర్మన్ గిల్ (Gill), శిఖర్ ధావన్ (Shikar)రెండు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj) (19), ఇషాన్ కిషన్ (Kishan) (20) నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా.. సఫారీ బౌలర్ల ధాటికి నిలబడలేక పోయారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (Shreyas) 150 దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. 37 బంతుల్లోనే అర్ధశతకం బాది కొంచెం ఒత్తిడిని తగ్గించే యత్నం చేశారు. కానీ ఎంగి వెనుదిరగక తప్పలేదు. వికెట్ కీపర్ సంజు శాంసన్ (Sanju) ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. సంజు శాంసన్ 63 బంతుల్లో 86 పరుగులతో రాణించాడు. చివరగా శార్దుల్ ఠాకూర్ (shardul) (33) భారత అభిమానుల్లో ఆశలు చిగురించేలా చేసినప్పటికీ చివరివరకూ నిలవలేకపోయాడు. అనంతరం వచ్చిన కుల్దీప్ యాదవ్ (kildeep) వెంటనే వెనుదిరిగారు. ఒకానొక దశలో భారత్ గెలుస్తుందనే అశలు చిగురించినా వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో విజయం దక్షిణాఫ్రికాను వరించింది.

అయితే మూడు వన్డేల సిరీస్‌‌లో (Series) అతిథ్య జట్టు 0-1 అధిక్యంలో నిలిచింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌కు 2 వికెట్లు, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. ఇక ఈ మొదటి వన్డే వన్డే లక్నోలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్‌ స్టేడియంలో జరిగింది. రెండో వన్డే: అక్టోబరు 9 – జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్‌ – రాంచి (Ranchi). మూడో వన్డే: అక్టోబరు 11 – అరుణ్‌ జైట్లీ స్టేడియం ఢిల్లీలో (Delhi) జరగునుండగా ఎలాగైన రెండో వన్డేలో గెలిచి భారత్ పోటిలో నిలవాల్సిన అవసరం ఉంది.

(Women Asia Cup : భారతే హాట్‌ ఫేవరేట్‌..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -