Belly Fat: ఇప్పుడు ఉన్న రోజుల్లో అందరూ ల్యాప్టాప్(Laptop) తో లేదా డెస్క్టాప్ తో ఎక్కువ కుస్తీ పడుతూ ఉంటారు ఎందుకు అంటే అందరూ జాబ్ చేసేది వాటి ముందు కూర్చిని(Sitting Position) కదా. ఇంట్లో ఐనా ఆఫీసు లో ఐనా వాటి ముందు కూర్చొని వర్క్ చేయాలి కదా. ఈ రోజుల్లో ల్యాప్టాప్ లేని ఇల్లు ఉంటుందా అంటే చాలా చాలా తక్కువ అని చెప్పాలి. ఇలా కూర్చొని కూర్చొని చేస్తూ ఉంటే ముందు మన పొట్ట బాణసంచి ల పెరిగిపోతుంది. అప్పుడు మనం అందహీనంగా కనిపిస్తుంటాం.బెల్లి ఫ్యాట్(Belly Fat) ని తగ్గించాలని నానా తిప్పలు పడుతూ ఉంటాం. మనం తీసుకునే ఆహారం కారణం గా కూడా మనకి బెల్లి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కరోన(Corona) వచ్చినప్పటి నుండి అందరూ ఫిట్ గా ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ సమయం కుదరక వర్కవుట్‌లు చేయడం లేదు అని బాదపడుతున్నారు. బెల్లీ ఫ్యాట్(Belly Fat) ను ఎలా తగ్గించుకోవచ్చు తెల్సుకుందాం.
(Olive Oil: ఆలివ్ ఆయిల్ మధుమేహాన్ని నియంత్రించగలదా?)
మనకి నచ్చిన జంక్ ఫుడ్(Junk Food) కి దూరంగా ఉండాలి కొంచమే కష్టమే కానీ తప్పదు చేయాలి. ఒకేసారి కాకుండా మెల్లి మెల్లిగా తగిస్తూ రావాలి జంక్ ఫుడ్ తినడం. మనం ఇంట్లో ఉన్నప్పుడూ ఏమి తోచక కూడా తింటూ ఉంటాం అది కూడా మానుకోవాలి. ఆడవారు అయితే సిరియల్స్ చూస్తూ తినడం మగవారు అయితే క్రికెట్ చూస్తూ తినడం లాంటివి చేస్తూ ఉంటారు కదా సాధారణం గా ఇలాంటివి కూడా తగ్గించాలి. మన ఇంట్లోనే చేసుకొని తాగి లేదా తినే చిట్కాలు తెల్సుకుందాం.
నిమ్మరసం: బరువు తగ్గడానికి నిమ్మరసం(Lemon Juice) ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. నిమ్మరసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వారు ఉదయం పూట ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మకాయ నీటిని తాగడం మంచిది.నిమ్మకాయ పుల్లగా ఉంటుంది అని తాగలేని వారు కొంచం తేనె(Honey) ని కలుపుకొని తాగచ్చు.నిమ్మకాయలలో విటమిన్ సి, ఇతర పోషకాలు విరివిగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు కొవ్వును కరిగిస్తాయి. నిమ్మకాయ నీటిని తాగడం వల్ల మీ జీర్ణక్రియ ప్రక్రియ సహజంగా మెరుగుపడుతుంది.
(Guava: జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుత ఔషధం జామాకులు)
జీరా వాటర్ (Jeera Water):
జీలకర కూడా బరువు తగ్గేందుకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను పెంచుతుందని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. రోజుకు రెండు సార్లు జీరా వాటర్(Jeera Water) ని తాగడం వల్ల ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ లో 250ml వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర ని వేసి నైట్ అంతా అలాగే ఉంచి ఉదయం పరికడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బాదంపప్పు: బాదంపప్పు(Almonds)లో పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. రోజుకు మీరు 4 నుంచి 6 బాదంపప్పులు తింటే మీ ఆకలి తీరుతుంది. నైట్ నానపెట్టి ఉదయం తినాలి. ఇలా చేయడం వల్ల కూడా తగినంత శక్తి మీ శరీరానికి అందుతుంది. చాలా ఆక్టివ్ గా మీడే స్టార్ట్ అవుతుంది.