end
=
Friday, September 20, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Divorce:ఇండియాలో పెరుగుతున్న విడాకులు..
- Advertisment -

Divorce:ఇండియాలో పెరుగుతున్న విడాకులు..

- Advertisment -
- Advertisment -
  • 50% నుంచి 60% శాతానికి చేరిన డివోర్స్ 
  • మహిళల్లో స్వతంత్ర భావాలే కారణం
  • సాన్నిహిత్యం కొరవడుతున్నట్లు వెల్లడి

భారతీయుల (Indians)కు విడిపోవడం లేదా విడాకులు (Divorce) తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ సంబంధాలు కేవలం ఇద్దరు వ్యక్తులను పరిగణనలోకి తీసుకుని ఏర్పడవు. సామాజిక ఒత్తిడి, కుటుంబాలు వంటి అనేక అంశాలు వివాహ బంధం (Marriage) తో ముడిపడి ఉంటాయి. పైగా పిల్లలు (children) ప్రమేయముంటే విడిపోవడం మరింత కష్టమవుతుంది. అయితే ఇతర దేశాల్లో (other countries) మహిళలే (women) అత్యధికంగా విడాకులు కోరుతుండగా.. భారత్‌లో మాత్రం పురుషుల (Men’s)దే పైచేయి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా (worldwide) అత్యల్ప విడాకుల రేటు(1.1%గా అంచనా) కలిగి ఉన్నది ఇండియానే అయినా.. కొన్నేళ్లుగా భారతదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో (urban areas) విడాకుల రేటు 50% నుంచి 60% వరకు పెరుగుతోంది. ఇందుకు గల కారణాలేంటి? ఈ సమస్యను భారతీయ జంటలు ఏవిధంగా ఎదుర్కోగలరు?

(Sex:ప్రపంచాన్ని మర్చిపోయే ఆ మధుర క్షణాలు…)

మహిళల్లో స్వతంత్ర భావాలు (Independent feelings) :

విడాకుల రేటు పెరిగేందుకు ప్రధాన కారణాల్లో ‘భారతీయ మహిళలు కొన్నేళ్లుగా ఆర్థికంగా (Economically), సామాజికంగా (socially) చాలా అభివృద్ధి (development) చెందడం’ ఒకటి. ఈ విషయాల కోసం వారు ఎదుటి వ్యక్తిపై పెద్దగా ఆధారపడటం (depend) లేదు. ఇంతకు ముందు డిపెండెన్సీ కారణంగా తమ సంబంధం దుర్వినియోగమైనప్పటికీ తెంచుకునేందుకు వెనకాడేవారు. అయితే ఈ రోజు స్త్రీలందరూ విద్యావంతులు (Educated) అవుతున్నందున ఎవరిపై ఆధారపడకుండా సొంత తెలివితేటలతో తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు.

అవిశ్వాసం, (disbelief) విశ్వాసం :

ఏ సంబంధానికైనా పునాది ‘విశ్వాసం’ అనే మాటలను తరచూ వింటాం. కాబట్టి నమ్మకమనే దారం తెగిపోతే అది ఎప్పటికీ సాధారణ స్థితికి చేరుకోదు. అయితే భారతదేశంలో అవిశ్వాసం అంతకంత వేగంగా (speed)పెరుగుతోంది. ప్రజలు చాలా త్వరగా మానసికంగా (Mentally) లేదా శారీరకంగా ఆసక్తిని (interest) కోల్పోతున్నారు. దాని వెనుకున్న కారణం.. వారు ఇతర వ్యక్తులకు మానసికంగా లొంగకపోవడమే. అందుకే తమ తాత్కాలిక (temporary) అవసరాల కోసం ఒకరి నుంచి మరొకరికి మారిపోతున్నారు.

సాన్నిహిత్యం లేకపోవడం :

ఒక బంధాన్ని సుదీర్ఘకాలం (long time) కొనసాగించడంలో వారి మధ్య గల సాన్నిహిత్యాని (Intimacy)దే కీలక (key role) పాత్ర. ఇక్కడ సాన్నిహిత్యం అంటే లైంగిక (sexual) ఆనందమో, భావోద్వేగ (emotional) ఆనందమో కాదు. ఇది కేవలం లోతైన సంభాషణ, చేతిలో చెయ్యేసుకుని ఒకరికొకరు (made for each other) మరింత నాణ్యమైన సమయాన్ని (Quality time) గడపడం. కానీ 21వ శతాబ్దంలో మెజారిటీ (majority) జంటలు ఒకరికొకరు ఇలాంటి రిలేషన్‌షిప్‌ను (relationship) కనుగొనేందుకు కష్టపడుతున్నారు. ఒకరికొకరు శారీరక (physical), మానసిక (mentally) అవసరాలను (needs) తీర్చుకునేందుకే ప్రాధాన్యత (importance) ఇస్తుండటంతో సమస్యలు (problems) మొదలవుతున్నాయి.

తేలికగా తీసుకోవడం :

సాధారణంగా జంటలు తమ రిలేషన్ (relation) ప్రారంభ దశలో ఒకరికొకరు ఎక్కువ సమయం (time) ఇచ్చుకునేవారని, ఎక్కువ శ్రమ (hard work) పడేవారని.. కానీ అది ఇప్పుడు మాయమైందన్నదే ఈ తరం జంటల (couples)ప్రధాన ఫిర్యాదు (complaint). భాగస్వామికి ప్రత్యేక అనుభూతిని (special feelings) కలిగించే విషయాలను పట్టించుకోలేకపోవడమే అసలు సమస్య. ఇలాంటివి నెరవేర్చేందుకు తగిన శ్రద్ధ (attention), సమయం లేకపోవడంతో పాటు భాగస్వామి చెప్పినపుడు వినకపోవడం లేదా మాట్లాడనివ్వకపోవడం వంటివి వారి సంబంధం లేదా వివాహానికి (marriage) ముగింపు (end) పలుకుతాయి.

కుటుంబాలు (family) లేదా స్నేహితుల (friends) జోక్యం :

ఈ రోజుల్లో స్త్రీ (women)పురుషులు పాత-కాలపు జీవనశైలి (Old-fashioned lifestyle) లేదా ఆలోచనలతో జీవించడం లేదు. కానీ మనం ఇప్పటికీ వివాహం ఒక నిర్దిష్ట మార్గం (A certain way)లో ఉండాల్సిన ఆచరణాత్మక (practices) సమాజంలో (society)  జీవిస్తున్నామనే వాస్తవంతో విభేదించలేం. ఇక్కడ జంటలు తమ పరిమితుల (limitations) గురించి తెలుసుకోవాలి. నిజం (facts) చెప్పాలంటే.. ఒక మహిళ ఇప్పటికీ తన అభిప్రాయాన్ని(opinion) స్వేచ్ఛగా (free)వెల్లడించేందుకు అనుమతించబడదు. డివోర్స్‌కు (divorce) గల ప్రధాన (main problems) సమస్యల్లో ఇదీ ఒకటి. ఈ సమస్యను అధిగమించడానికి (overcome) మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొత్త తరం (new generation)లో మరో సమస్య ఉంది. వారు సహనం తక్కువ, దూకుడు ఎక్కువ. సమస్యాత్మక వివాహానికి దారితీసే కుటుంబాలతో రాజీ పడటం (Compromise) లేదా సర్దుబాటు (adjustment) చేసుకోవడాన్ని ఈ కొత్త తరం అస్సలు నమ్మదు.

(One Night Stand:‘వన్ నైట్ స్టాండ్’ తప్పా? ఒప్పా?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -