end
=
Tuesday, November 26, 2024
వార్తలుఅంతర్జాతీయంIran Hijab :ఇరాన్ లో హిజాబ్ లా కాల్చివేత…
- Advertisment -

Iran Hijab :ఇరాన్ లో హిజాబ్ లా కాల్చివేత…

- Advertisment -
- Advertisment -
  • ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా స్త్రీల నిరసనలు
  • అమినికి మద్ధతుగా జుట్టు కత్తిరించుని సంఘీభావం
  • ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతోన్నసెలబ్రిటీల ప్రొటెస్ట్

Iran Hijab : సమాజంలో శతాబ్దాలుగా అణిచివేయబడుతున్న స్త్రీలు (Women).. తమ హక్కుల (rights) కోసం పోరాడుతూ చరిత్రలో శక్తికి చిహ్నంగా వెలుగొందుతున్నారు. పితృస్వామ్య వ్యవస్థ (Patriarchal system)కు వ్యతిరేకంగా తమ శరీరాన్ని (body) నిరసనకు ప్రతీకగా వినియోగిస్తున్నారు. ఓటు హక్కు ఉద్యమం (Movement)లో బ్రా (Bra)లను కాల్చేసి శారీరక స్వయంప్రతిపత్తి (Autonomy)పొందేందుకు ఆందోళన నిర్వహించిన మహిళలు.. సైనికులు (Soldiers) మహిళను హత్యాచారం (Murder) చేసినందుకు 2004లో మణిపూర్‌ (Manipur)లో నగ్నం (nude)గా నిరసన తెలిపారు. నేడు కూడా ఇరాన్‌లో (Iranian) ఇదే చరిత్ర (history)పునరావృతం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు హెయిర్ కట్ (Cutting Hair)చేసుకుని ఇరాన్‌ స్త్రీలకు మద్దతిస్తూ.. ఇరాన్ మొరాలిటీ పోలీసింగ్‌ (Morality policing)కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ (protest)చేస్తున్నారు.

(Alcohol:అసహనం పెంచుతున్న ఆల్కహాల్‌)

ప్రపంచ నిరసన చిహ్నంగా జుట్టు కత్తిరించడం:

హిజాబ్ (Hijab) సరిగ్గా ధరించనందుకు పోలీసులచే అరెస్టు (arrest) చేయబడిన మహసా అమిని (Mahsa Amini) వారిచేతిలో మరణించిన తర్వాత ఇరాన్ అంతటా మహిళలు పెద్దఎత్తున అల్లర్లు సృష్టించారు. తమ జుట్టు, మెడను బహిరంగంగా స్కార్ఫ్‌ (scarf) తో కప్పుకోవాలని ఒత్తిడి చేసే ఇస్లామిక్ (islamic) పాలన (governance) కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా హిజాబ్‌లను కాల్చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్లామిక్ చట్టానికి వ్యతిరేకంగా వరల్డ్ వైడ్‌ (Against the law world wide)గా మహిళలు ‘జుట్టు కత్తిరించడం’.. ఇరాన్‌ స్త్రీల మద్దతు అందించే ‘ప్రపంచ చిహ్నం’ (‘World Icon’)గా మారింది. ముందుగా మసీహ్ అలినెజాద్ (Masih Alinejad)అనే ఇరానియన్ జర్నలిస్ట్.. (journalist)  తన జుట్టును కత్తిరించే వీడియో (video)ను ట్విట్టర్‌ (twitter)లో పంచుకుంటూ..  హిజాబ్ పోలీసులు #మహసాఅమినిని చంపినందుకు నిరసనగా ఇరాన్ మహిళలు తమ జుట్టును కత్తిరించుకోవడం, హిజాబ్‌ను కాల్చడం ద్వారా తమ ఆగ్రమాన్ని ప్రదర్శించాలని కోరింది.  అంతేకాకుండా, హిజాబ్ వ్యతిరేక నిరసన సమయంలో పోలీసులచే చంపబడిన జావద్ హెదరీ (Javad Heydari) సోదరి తన సోదరుడి అంత్యక్రియల సమయంలో తన జుట్టును కట్ చేసుకున్న వీడియో కూడా వైరల్ (viral) అయ్యింది.

బిగ్ ప్లాట్‌ఫామ్స్‌ (Big platforms)పై సెలబ్రిటీల ప్రొటెస్ట్ (Celebrity Protest):

ఇరాన్ మహిళల ఈ ధిక్కార చర్య ఫలితంగా యూరప్ (Europe), USA, మిడిల్ ఈస్ట్‌ (middle east)లో చాలా మంది మహిళలు జుట్టు కత్తిరించుకుని సంఘీభావంగా నిలుస్తున్నారు. ఇటీవల  స్వీడిష్ యూరోపియన్ పార్లమెంటు (Swedish European Parliament)సభ్యురాలు అల్-సహ్లానీ (Al-Sahlani) EU పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ హెయిర్ కట్ చేసుకుంది. ‘ఇరాన్‌కు స్వేచ్ఛ (freedom) లభించేంత వరకు, మా ఆగ్రహం అణచివేతదారుల కంటే పెద్దదిగా ఉంటుంది. ఇరాన్ మహిళలు స్వేచ్ఛను పొందేంత వరకు అండగా ఉంటాం’ అని,  జిన్- జియాన్-ఆజాదీ (Jin-Jian-Azadi) (స్త్రీ-జీవితం-స్వేచ్ఛ)’ అంటూ హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో ఇరాన్ మహిళా నిరసనకారుల నినాదంతో మద్దతిచ్చింది. అంతేకాకుండా టర్కిష్ సింగర్ మెలెక్ మోసో (Turkish singer Melek Moso) ప్రదర్శన చేస్తున్న సమయంలోనే వేదికపై జుట్టును కత్తిరించుకుని.. ఇరాన్ మహిళల నిరసనకు సంఘీభావం తెలిపిన చర్య వైరల్‌గా మారింది.

జుట్టు కత్తిరించడంలో ఆంతర్యం?

ప్రపంచవ్యాప్తంగా (Worldwide) స్త్రీలలో జుట్టు కత్తిరించడం నిరసనకు చిహ్నంగా ఎందుకు మారిందంటే.. జుట్టును స్త్రీల అందానికి ప్రతీకగా (symbol of beauty) చూస్తారు. ఇరానియన్ మహిళలు ఏడేళ్ల వయస్సు (7 years) నుంచి జుట్టును హిజాబ్ కింద దాచడానికి బలవంతం చేయబడతారు. తమ జుట్టును కత్తిరించుకోవడం లేదా బహిరంగంగా షేవింగ్ (saving) చేయడం ద్వారా మహిళలు సమాజ సౌందర్య ప్రమాణాల గురించి పట్టించుకోరని.. వారు ఎలాంటి దుస్తులు (dressing)ధరించాలి, ఎలా జీవించాలో నిర్ణయించుకోవడానికి ఎవరినీ అనుమతించరని అర్థం. అంతేకాకుండా పెర్షియన్ సాహిత్యం (Persian literature)లో స్త్రీలు జుట్టును కత్తిరించడం అనేది సంతాపం (condolence), నిరసనలకు చిహ్నంగా ఉపయోగించబడింది.  ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు అమినీ మరణానికి సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా.. ఆమె మరణానికి దారితీసిన హిజాబ్ నియమం, హిజాబ్ పోలీసులపై కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

(Japan: వింత దొంగ అరెస్ట్.. అమ్మాయిలవే టార్గెట్‌గా)

ఇరాన్‌కు ప్రపంచ సంఘీభావం:

2022లో కూడా మహిళలు స్వేచ్ఛగా జీవించే, కోరుకున్న దుస్తులు ధరించే హక్కు కోసం నిరసనలు చేయాల్సి రావడం బాధాకరం అయినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఇరాన్ మహిళలకు సంఘీభావంగా నిలబడటం ఆశ్చర్యంగా ఉంది. జుట్టును కత్తిరించడం అనేది అందం (beauty) ప్రమాణాలు, దానికి సంబంధించిన నియమాలను ధిక్కరించే చిహ్నం (symbol of defiance). సమాజంలోని ప్రతి విభాగంలోని స్త్రీలు ఈ నియమాలు మరియు ప్రమాణాల క్రింద బంధించబడి ఉన్నారు.  అందం, సంస్కారం యొక్క సామాజిక ప్రమాణాలను పరిగణలోకి తీసుకోవడం మూలంగా చాలా మంది మహిళలు తమ జుట్టును కత్తిరించుకోలేరు. అంతెందుకు ఓపెన్ హెయిర్‌తో (open hair)తిరగడం అరిష్టమని స్త్రీలను కట్టడి చేయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పితృస్వామ్య పాలనకు చిహ్నంగా జుట్టును ఉపయోగించడం ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా మహిళలు యుగయుగాలుగా స్త్రీజాతి ఎదుర్కొంటున్న సమస్యకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పితృస్వామ్య పాలనను తొలగించడానికి ఈ సిస్టర్‌హుడ్ (Sisterhood)అనేది అవసరం. మహిళలు ఒక్కతాటిపైకి వచ్చి ఒక స్త్రీ సమస్యను మొత్తం స్త్రీజాతి (Feminine)సమస్యగా పరిగణిస్తే, స్త్రీవాదం కొత్త ఉత్సాహాన్ని పొందుతుంది. ఇప్పుడు ఇరాన్ మహిళల ఆందోళనలకు మద్దతివ్వడం స్త్రీల కర్తవ్యం. ఎందుకంటే ఎంచుకున్న దుస్తులు ధరించే స్వేచ్ఛ భారతదేశంతో (india) సహా పలు దేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. కాబట్టి జుట్టును కత్తిరించండి, బహిరంగంగా మాట్లాడండి, మహిళలు కోరుకునే స్వేచ్ఛను పొందడానికి మీరు చేయగలిగినదంతా చేయాలని మేధావులు పిలుపునిస్తున్నారు.

(Mephedrone Drugs: 60 కేజీల మెఫిడ్రోన్‌ డ్రగ్స్‌ సీజ్‌)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -