end
=
Saturday, November 23, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Letter:సోషల్ మీడియాను మించిన మాధ్యమం..
- Advertisment -

Letter:సోషల్ మీడియాను మించిన మాధ్యమం..

- Advertisment -
- Advertisment -

  • డిజటల్ జనరేషన్‌లోనూ ‘లేఖ’లో అక్షరాల కొత్తదనం
  • ఎన్ని ఫాంట్‌లున్నా చేతిరాత ఎప్పటికీ ప్రత్యేకమే
  • అందుకున్న లేఖల్లో భావోద్వేగాలతో ముడిపడిన జ్ఞాపకాలు
  • అక్షరాలతో పాటు ప్రయాణిస్తున్న ఆలోచన, డీఎన్ఏ
  • బంధం, సృజనాత్మకతకు మారుపేరుగా లెటర్


దశాబ్దాలుగా కమ్యూనికేషన్ మోడ్స్ (Modes of Communication) అభివృద్ధి చెందడంతో మనం నెమ్మదిగా పోస్ట్‌కార్డ్‌, టెలిగ్రామ్‌, ఇన్‌ల్యాండ్ లెటర్‌ (Postcard, Telegram, Inland Letter) నుంచి ఫోన్ కాల్‌, వాట్సాప్, ఇమెయిల్‌, ఇన్‌స్టాగ్రామ్, వీడియో కాల్‌ (Phone Call, Whatsapp, Email, Instagram, Video Call) వంటి న్యూ వర్షన్‌ (New version)కు చేంజ్ (change) అయ్యాం. కానీ ట్రెడిషనల్ టెలిగ్రామ్ (Traditional Telegram) అంతరించిపోవడానికి ఎవరినీ నిందించలేం. ఎందుకంటే ఇది ఇన్‌స్టాంట్ కమ్యూనికేషన్ (Instant communication) యొక్క ప్యూర్లీ ఫంక్షనల్ ఫార్మాట్ (A purely functional format). కాగా ఫోన్ కాల్స్, వాట్సాప్ మరింత సమర్థవంతంగా కవర్ (cover) చేస్తుంది. అయితే టెక్నాలజీతో (technology)ఈ రోజు ఎంత వేగంగా సందేశాలు(messages)పంపించబడుతున్నా సరే.. భావోద్వేగాలను సంగ్రహించడంలో చేతితో రాసిన లేఖకు మించిన సమర్థవంతమైన మాధ్యమం లేదు. ఇందులో రాసిన అక్షరాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే.. ప్రత్యేకమైనవారికే. అందుకే పెన్నులో ఇంక్ (pen inc) అయిపోకూడదు.. డిజటల్ జనరేషన్ (Digital Generation)లేఖ రాయడం మరిచిపోకూడదని కోరుకుంటున్నారు పెద్దలు.

లెటర్ రైటింగ్-అక్షరాల కొత్తదనం :


దాదాపు 70 లేదా 80ల వరకు ఇతర ఎంపికలు లేనందున.. బంధువులు, స్నేహితులు, ప్రియమైన వారితో కమ్యూనికేషన్ (Communication)కోసం లెటర్స్ (letters)రాసేవారు. ఇది చాలా మందికి ఓ అభిరుచిగా కూడా ఉండేది. అదృష్టవశాత్తూ ప్రస్తుతం మనం మన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే లేఖను రాయడాన్ని ఎంచుకుంటున్నాం. ఎందుకంటే చేతితో వ్రాసిన లేఖ ఎక్కువ సమయం కోరుతుంది. ఈ వేగవంతమైన ప్రపంచంలో (world)మరింత విలువైనదిగా మారుతుంది. ముఖ్యంగా 50ఏళ్ల క్రితం డియరెస్ట్ పర్సన్స్ (Dearest Persons)నుంచి అందుకునే లెటర్స్ (letters) ఎంత ప్రత్యేకంగా ఉన్నాయో ఇప్పటికీ అంతే స్పెషల్‌గా (special)మారాయి. నిజానికి ఇప్పుడు వీటిని మరింత కొత్తగా యాక్సెప్ట్ (accept)చేస్తున్నందున సోషల్ మీడియాకు ఒక స్టెప్‌ (step)పైనే నిలబడి మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

(Whatsapp:వాట్సాప్‌‌లో ప్రతి మెసేజ్‌కు రిప్లయ్ ఇస్తున్నారా?)

కట్.. కాపీ.. పేస్ట్.. లేదు :


మీరు ఒక లేఖ వ్రాసినప్పుడు.. ఆ వ్యక్తి నుంచి సందేశాలను అందుకోవడం అనేది చాలా భిన్నమైన అనుభవం. ఎందుకంటే ఆ పర్సన్‌ను స్పెషల్‌గా ట్రీట్(special treat)చేస్తూ.. సెంటర్ ఆఫ్ యువర్‌ అటెన్షన్‌ (Center of your attention)గా ఉంచుతారు. ఆ వ్యక్తి కోసం మీ పదాలను కాగితంపై పరిచే ముందు బాగా ఆలోచిస్తారు. ఎలాంటి స్క్రాచింగ్ వర్డ్స్ (Scratching Words) లేకుండా జాగ్రత్త పడుతారు. పైగా ఒక్కసారి రాస్తే డిలీట్- కట్-కాపీ-పేస్ట్(Delete- Cut-Copy-Paste) చేసే ఫ్రీడమ్ (freedom)ఉండదు. అంతేకాదు ఎదుటివ్యక్తి రియాక్షన్ (reaction)ఎలా ఉంటుందోననే మీ మనసులో ఆలోచన మరింత ఎగ్జయిటింగ్‌గానూ, హ్యాపీగానూ (Exciting and happy)ఉంటుంది. మొత్తానికి లేఖ ముగిసే సమయానికి కాగితంపై కనిపించేది, ఫోన్‌లో సాధారణంగా చేసే మెసేజ్‌కు జమీన్‌, ఆస్మాన్ ఫరక్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇంటర్నెట్ (internet)అంతగా ప్రాచుర్యంలోకి రాకముందు అంటే 90ల వరకు స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రాయడం అనేది ఆ బంధం, సృజనాత్మకత (creativity)యొక్క అర్థవంతమైన మార్గం. వివిధ రంగుల పెన్నులను (pens) ఉపయోగించడం, స్కెచ్ పెన్స్ (sketch)వాడుతూ వారి కోసం ఆర్ట్ (art)వేయడం.. ప్రత్యేక స్టాంపులు (stamps) జోడించడం… వెకేషన్‌ (vacation)నుంచి పోస్ట్‌కార్డ్ (post card)పంపడం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ఆలోచించండి. నిజానికి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ (instagram post)కు పోస్ట్‌కార్డ్‌కు చాలా డిఫరెన్స్ ఉంది. Instagramలో ప్రపంచంతో పంచుకుంటే.. పోస్ట్‌కార్డ్‌ ద్వారా ఒక నిర్దిష్ట వ్యక్తితో షేర్ (share) చేసుకుంటారు. ఆ సమయంలో మీరు వారి గురించి ఆలోచిస్తున్నట్లు వారికి గుర్తుచేస్తారు. సోషల్ మీడియాలో రియాక్షన్‌ను (reaction)బట్టి లవ్ యూ, (love you) మిస్ యూ (miss you)చెప్పినా.. పోస్ట్ కార్డ్‌లో అలాంటి ఫేక్ లవ్ (fake love) కనిపించదు.

స్పెషల్లీ అడ్రస్డ్ : (Specially Addressed)


మీకు ప్రత్యేకంగా వ్రాసిన ఉత్తరాలు (letters)అందుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇందుకోసం తప్పనిసరిగా దీర్ఘ లేఖలు రాయాల్సిన అవసరం లేదు. ఎదుటివ్యక్తిని నవ్వించేలా చిన్నపాటి స్టిక్కీ నోట్స్ (Sticky notes) కూడా అద్భుతమైన సంజ్ఞగా (signal) ఉంటుంది. ఇది మీ స్వంత ఇంట్లో మీ జీవిత భాగస్వామి (life partner) పట్ల ప్రేమను వ్యక్తపరిచినా, లేదా మీ సహోద్యోగికి కాంప్లిమెంట్ (Compliment a colleague)ఇచ్చినా, మీకు రుచికరమైన ఆహారాన్ని (tasty food)అందించిన వెయిటర్‌కు ధన్యవాదాలు తెలిపినా.. ఈ మాధ్యమం ద్వారా చాలా ప్రత్యేకమైనదిగా మారుతుంది. అసలు విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ తమ పేరు మీద ఒక లేఖ స్వీకరించడానికి ఇష్టపడతారని గుర్తుంచుకోండి.

టచ్.. ఫీల్.. స్మెల్.. (Touch.. Feel.. Smell..)


అక్షరాల భౌతికత్వం కాదనలేనిది, సాటిలేనిది. నెట్టింట వేలాది ఫాంట్ (font)ఎంపికలు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్క చేతిరాత (hand writing) ప్రత్యేకంగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు కవరుపై (cover)ఆ స్టాంపును (stamp)నొక్కినప్పుడు, అతికించినప్పుడు మీ ఆలోచనలే కాదు, మీ DNA కూడా మీ అక్షరంతో ప్రయాణిస్తుంది. అంతేకాదు మీకు నచ్చిన విధంగా నచ్చిన భాషలో (language), కోరుకున్న షేప్‌ (shape)లో ప్రియమైనవారికి లెటర్‌ను పోస్ట్ చేయొచ్చు. అందుకున్న లేఖలను భద్రంగా దాచుకోవచ్చు. తీరిక సమయంలో లేఖలలోని జ్ఞాపకాలను (Memories) గుర్తుచేసుకోవచ్చు. ఈ సమయంలో ప్రతీ పదంలోని ప్రాముఖ్యత.. భిన్నమైన భావోద్వేగం మనసును తడుతుంది. ఏదేమైనా కొన్ని సందేశాలు వెంటనే వాట్సాప్‌లో (whatsapp).. మరికొన్ని లాంగ్ కాల్‌లో (long call)చెప్పేందుకు బెస్ట్ ఆప్షన్ (best option) అయితే.. మరి కొన్నింటికి లేఖ ద్వారనే న్యాయం జరుగుతుంది.

(Dengue:డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -