end
=
Thursday, September 19, 2024
వార్తలురాష్ట్రీయంDiwali:పటాసులు పేల్చితే 6 నెలల జైలు శిక్ష..
- Advertisment -

Diwali:పటాసులు పేల్చితే 6 నెలల జైలు శిక్ష..

- Advertisment -
- Advertisment -
  • దీపావళిపై సంచలన నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం
  • రేడియోధార్మిక, విషపూరిత పదార్థాలతో క్యాన్సర్ ముప్పు
  • టపాసులతో వాయు, శబ్ద కాలుష్యం, శ్వాసకోశ సమస్యలు
  • వృద్ధులు, పిల్లల్లో వినికిడి సమస్యలు తలెత్తే ప్రమాదం

ఢిల్లీ ప్రభుత్వం(Delhi Government) జనవరి 1, 2023 వరకు అన్ని రకాల పటాకుల నిల్వ, అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. ఈ దీపావళికి పటాసులు పేల్చితే ఆరు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా తప్పదని హెచ్చరించింది.  అయితే ఈ నిర్ణయాన్ని కొందరు యాంటీ-హిందుగా అభివర్ణించే ప్రయత్నం చేస్తూ పిటిషన్ వేసినా.. పటాసుల మీద పెట్టిన ఖర్చు స్వీట్స్ మీద పెట్టాలని, తద్వారా అందరినీ కాలుష్యానికి గురికాకుండా, ఆరోగ్యంగా ఉండనిద్దామని న్యాయస్థానం పిలుపునిచ్చింది. ఇంతకీ దీపావళిలో పటాకులను ఎందుకు చేర్చకూడదు? ఒకవేళ చేరిస్తే పర్యావరణం(Environment), ప్రజలపై ఎలాంటి దుష్ప్రభావాలు(Side Effect) కలుగుతాయి? వంటి విషయాల గురించి తెలుసుకుందాం. 

ఉత్సాహాన్ని పంచే దీపాల పండుగకు తోడు పటాకాయలను(Crackers) కూడా చేర్చాలని ప్రతీ ఒక్కరు భావిస్తారు. ముఖ్యంగా పిల్లలు రంగురంగుల పటాకులతో ఆడుకునేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ వీటిని కాల్చడం మూలంగా తమ ప్రియమైనవారి ఆరోగ్యమే కాకుండా.. జంతువులు, ప్రకృతి(Nature)కి ఎంత ప్రమాదకరమో ఆలోచించాలి అంటున్నారు నిపుణులు. ‘దివాళీ’ పండుగ సందర్భంగా టపాసులను వినియోగించడం వలన కలిగే నష్టాలు, అవి లేకుండా పండుగ జరుపుకోవడం వలన మన చుట్టుపక్కల వారికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవాలని కోరుతున్నారు. 

1. వాయు కాలుష్యం

పటాకులు పేల్చడం వల్ల వాయుకాలుష్యం(Air Pollution) పెరుగుతుంది. మీరు దీపావళి తర్వాత రోజు దట్టమైన పొగ మేఘాలను చూసి ఉండవచ్చు. దానికి క్రాకర్స్ తప్ప వేరే కారణం లేదు. పటాకులు కాల్చినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, ట్రైఆక్సిజన్, బ్లాక్ కార్బన్ వంటి విషపూరిత(Poisonous) వాయు కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. దట్టమైన పొగ మేఘాల ఉత్పత్తికి దారితీస్తాయి. ఇది కళ్లు, గొంతు, ఊపిరితిత్తులు, గుండె, చర్మంపై ప్రభావం చూపుతుంది.

2. శబ్ద కాలుష్యం

పటాకులు కాల్చడం ద్వారా వచ్చే పెద్ద పెద్ద శబ్దాలు శబ్ద కాలుష్యానికి(Sound Pollution) దారితీస్తాయనడంలో సందేహం లేదు. ఇది యువకులను అంతగా ప్రభావితం చేయకపోవచ్చు కానీ పెద్దలు, చిన్న పిల్లలకు పీడకలగా మారుతుంది. సున్నితమైన వినికిడిని కలిగి ఉండే రెండు సమూహాలు ఈ పెద్ద శబ్దాల వల్ల ప్రభావితమవుతాయి. అసౌకర్యానికి గురికావడమే కాదు వినికిడిని(Hearing) కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. 

3. శ్వాసకోశ సమస్యలు

క్రాకర్స్ పేల్చడం ద్వారా దుమ్ము యొక్క గాఢత పెరిగి.. ఆస్తమా, అలెర్జీ బ్రోన్కైటిస్ కలిగి ఉన్నవారిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వాయు కాలుష్య కారకాలు COPD, ILD వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల(Respiratory diseases)ను ప్రేరేపిస్తాయి. తద్వారా ఆసుపత్రిలో చేరడంతో పాటు మందుల వినియోగాన్ని పెంచుతాయి. విడుదలయ్యే విష వాయువులు పూర్తిగా ఆరోగ్యవంతమైన వ్యక్తులలో తీవ్రమైన రియాక్టివ్ ఎయిర్‌వే డిస్‌ఫంక్షన్ (RADS)కి కారణమవుతాయి.

     

4. క్యాన్సర్‌కు దారితీయవచ్చు

ఇది ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ, పటాకులు కొన్ని క్యాన్సర్‌లకు కూడా కారణం కావచ్చు. బాణసంచా పేలినప్పుడు కలర్స్ వచ్చేందుకు వాటిని తయారుచేసే క్రమంలో.. రేడియోధార్మిక(Radioactive) మరియు విషపూరిత పదార్థాలు జోడించబడతాయి. ఈ పదార్థాలు గాలిని కలుషితం చేసినప్పుడు క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే వ్యక్తుల అవకాశాన్ని పెంచుతాయి.

5. పెంపుడు జంతువులకు అసౌకర్యం

అకస్మాత్తుగా మరియు బిగ్గరగా పటాకులు పేలడం వల్ల జంతువులు(Animals) ఒత్తిడి, భయం, ఆందోళనకు గురవుతుంటాయి. అంతేకాకుండా ఈ క్రాకర్లలోని రసాయనాలకు కొన్ని తీవ్రమైన ప్రతిచర్యలను కూడా అనుభవిస్తాయి. పటాకుల ద్వారా గాలిలో విడుదలయ్యే రసాయనాలు.. జంతువులు మరియు పక్షులలో బర్నింగ్ సెన్సేషన్ కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కొన్ని గాయాలకు కూడా కారణమవుతుంది. కాబట్టి బాణసంచా వాడకాన్ని ఆపడం ద్వారా కుటుంబాన్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకోవడం కాదు పర్యావరణం మరియు జంతువులకు కూడా సహాయం చేసినవారు అవుతారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -