end
=
Monday, March 31, 2025
వార్తలురాష్ట్రీయంLegacy Waste:లెగసీ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భారత్ విఫలం
- Advertisment -

Legacy Waste:లెగసీ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భారత్ విఫలం

- Advertisment -
- Advertisment -

‘బయోమైనింగ్’ను తప్పనిసరి చేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్

వనరులను రీసైకిల్ చేయడానికి అనుమతిస్తుందని వెల్లడి

చెత్త డంప్‌ సైట్లు వాటి సామర్థ్యాన్ని మించిపోవడంతో భారతదేశంలోని ప్రముఖ నగరాలు లెగసీ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో విఫలమవుతున్నాయి(Failing). ఏదైనా బంజరు భూమి లేదా అంకితమైన ల్యాండ్‌ఫిల్‌లో ఏళ్ల తరబడి సేకరించి ఉంచిన వ్యర్థాలను లెగసీ వేస్ట్ అంటారు. స్వచ్ఛ భారత్ నివేదిక (2020) ప్రకారం, మునిసిపల్ ఘన వ్యర్థాలు పారబోతకు ఇండియా ప్రతి ఏటా 1,250 హెక్టార్లకు పైగా ఉపయోగకరమైన భూమిని కోల్పోతోంది. అంతేకాదు దేశంలోని 3,159 లెగసీ వేస్ట్ డంప్‌ సైట్ల క్రింద 10,000 హెక్టార్లకు పైగా ఉపయోగించదగిన పట్టణ భూమి లాక్ చేయబడిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నివేదించింది. కాగా వ్యర్థ పదార్థాల నిర్వహణలో నెలకొన్న తీవ్ర సమస్యను ఎదుర్కొనేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, 2016 ప్రకారం ప్రభుత్వం ‘బయోమైనింగ్’(Biomining)ను తప్పనిసరి చేసింది. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు సవాళ్లు ఏంటో చూద్దాం..

(Sleep: నిద్రకు ముందు చేయకూడని పనులు.. )

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(CPCB) మార్గదర్శకాల ప్రకారం.. ‘బయోమైనింగ్ అనేది సాధారణంగా లెగసీ వేస్ట్‌గా(Legacy Waste) సూచించబడే డంప్‌సైట్స్‌లో పేరుకుపోయిన మునిసిపల్ ఘన వ్యర్థాలను తవ్వడం, శుద్ధి చేయడం, వేరు చేయడంతో పాటు లాభదాయకమైన వినియోగానికి సంబంధించిన శాస్త్రీయ ప్రక్రియ’. సరళంగా చెప్పాలంటే, ఇది చెత్త లేదా వ్యర్థాలను బయో-ఆర్గానిజమ్స్ లేదా గాలి, సూర్యకాంతి వంటి సహజ మూలకాలతో శుద్ధి చేసే ప్రక్రియ. కాలక్రమేణా వ్యర్థాల్లోని బయోడిగ్రేడబుల్ భాగం సహజ ప్రక్రియ ద్వారా కుళ్లిపోతుంది. మిగిలిన భాగం అంటే నాన్ బయోడిగ్రేడబుల్(Non biodegradable) పదార్థం విడిగా నిర్వహించబడుతుంది. ఇది రాతి ఖనిజాలు లేదా గని వ్యర్థాల నుంచి ఆర్థిక ప్రయోజనాలు గల లోహాలను సంగ్రహిస్తుంది.ఇందులో ‘లెగసీ వేస్ట్ త్రవ్వకం, బయోరీమిడియేషన్ ఉపయోగించి వ్యర్థాలను స్థిరీకరించడం, తవ్విన వ్యర్థాలను వేరు చేయడం, స్థిరమైన నిర్వహణతో పాటు దాన్ని సురక్షిత పారవేయడం’ వంటి నాలుగు దశలు ఉంటాయి. ఇక బయోమైనింగ్ పద్ధతుల్లో బయోలీచింగ్, బయో-ఆక్సిడేషన్, డంప్ లీచింగ్, ఎజిటేటెడ్ లీచింగ్ ఉన్నాయి.

భారతదేశం ఎంత వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది?

ప్రణాళికా సంఘం నివేదిక(2014) ప్రకారం.. అర్బన్ ఇండియాలో ప్రతి ఏటా 62 మిలియన్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ సంఖ్య ప్రతి ఏడాది 4 శాతం పెరుగుతోంది. అయితే ఈ 62 మిలియన్‌ టన్నుల చెత్తలో 45 మిలియన్‌ టన్నుల చెత్తకు సంబంధించి ఎటువంటి నిర్వహణ లేదు. ఇక దేశంలోని 60 ప్రధాన నగరాలు కలిపి దాదాపు 3,500 టన్నుల ప్లాస్టిక్(Plastic) వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగుళూరు నగరాలదే అగ్రస్థానం. 2011 జనాభా లెక్కల ప్రకారం, కేవలం మూడింట ఒక వంతు కుటుంబాలకు వారి ఇళ్లలో మురుగునీటి వ్యవస్థ ఉంది. అలాగే, 38.2 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు సెప్టిక్ ట్యాంక్‌(Septic Tank)లతో అనుసంధానించబడి ఉన్నాయి. అధ్వాన్నమైన విషయం ఏమిటంటే నిర్మించిన ట్యాంకుల పరిస్థితి కూడా చాలా అధ్వాన్నంగా ఉంది.

బయోమైనింగ్‌ తప్పనిసరి ఎలా?

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, 2016.. ఇప్పుడు ‘క్యాపింగ్’కు బదులుగా బయో-మైన్ లెగసీ వ్యర్థాలను తప్పనిసరి చేసింది. అంటే వ్యర్థాలను మట్టితో కప్పడం. మూలం వద్ద వ్యర్థాలను వేరు చేయడం, శానిటరీ & ప్యాకేజింగ్ వ్యర్థాలను పారవేయడంలో తయారీదారు బాధ్యత, బల్క్ జనరేటర్ నుంచి సేకరణ, పారవేయడం & ప్రాసెసింగ్ కోసం వినియోగదారు రుసుములపై ఈ నియమాలు ఫోకస్(Focus) చేస్తాయి. కంపోస్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం, వ్యర్థాలను శక్తిగా మార్చడం, బయో-డిగ్రేడబుల్ వ్యర్థాలను ఎలా ప్రాసెస్ చేయాలి? శుద్ధి చేయడంతో పాటు ఎలా పారవేయాలి? అనే సూచనను కూడా ఈ రూల్ కలిగి ఉంటుంది.

(Gas stoves:గ్యాస్ స్టవ్ ఆరోగ్యానికి హానికరమే..)

బయోమైనింగ్ ప్రయోజనాలు :

బయోమైనింగ్ సున్నా ఉద్గారాలు, సున్నాకి సమీపంలోని అవశేషాలను వదిలివేయడం వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. నేల, భూగర్భ(Underground) జలాల కాలుష్యాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. ఇది గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను కూడా తగ్గించనుండగా.. ఆ ప్రక్రియకు శక్తి అవసరం లేదు. అంతేకాదు తిరిగి పొందిన భూమిని ఇతర అభివృద్ధి ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ఇక ల్యాండ్‌ఫిల్స్(Landfills) వ్యాధులు కలిగించే ప్రధాన వనరుల్లో ఒకటి. వాటిని క్లియర్ చేయడం వల్ల వాహకాల ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఘన వ్యర్థాలను సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల అభివృద్ధి చెందే 22 వ్యాధులను US పబ్లిక్ హెల్త్(Public Health) జాబితా చేసింది. ఈ మేరకు బయోమైనింగ్ అనేది పర్యావరణ అనుకూల పద్ధతి. ఇది లోహం, ఎరువుల్లో కంపోస్ట్ తదితర వ్యర్థాల నుంచి ఉపయోగకరమైన భాగాలను సంగ్రహించడం ద్వారా వనరులను రీసైకిల్(Recycle) చేయడానికి అనుమతిస్తుంది.

సవాళ్లు ఏమిటి?

బయోమినింగ్ అనేది బయో-డిగ్రేడబుల్ కాంపౌండ్స్‌కు మాత్రమే పరిమితం చేయబడింది. కాబట్టి ఫలితాలు పొందేందుకు సమయం పడుతుంది. సూక్ష్మజీవులు సృష్టించిన ఆమ్ల, లోహ-సమృద్ధమైన ద్రావణ లీకేజీతో పాటు చికిత్స అనేది ముఖ్యమైన పర్యావరణ ప్రమాదాల్లో ఒకటి. అయినప్పటికీ నియంత్రిత పరిస్థితుల్లో ప్రోటోకాల్స్(Protocols) అనుసరించి చేస్తే నిర్వహించవచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -