చికెన్ తో మనం చాలా చాలా వెరైటీ(different) స్నాక్స్ ని చేసుకోవచ్చు. అందులో ఒకటి చికెన్ నగేట్స్. చికెన్ అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడనివారు ఉండరు. అందులో చికెన్ స్నాక్క్స్(Snack) అంటే లొట్టలు వేసుకొని మరి తింటూ ఉంటాం.ఇప్పుడు చికెన్ నగేట్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్:1/2kg, బ్రెడ్‌ముక్కలు: 6, గుడ్లు: రెండు, కార్న్‌ఫ్లోర్: 2 టేబల్ స్పూన్, జీలకర్ర పొడి: పావు టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, కారం: తగినంత, ఉప్పు: తగినంత, పసుపు: చిటికెడు, నూనె: ఫ్రై కి సరిపడా.
ముందుగా బ్రెడ్ ముక్కలని తీసుకొని వాటి సైడ్స్ ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చిన్న మిక్సీ జార్‌లో బ్రెడ్‌ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు అందులో చికెన్(Chicken),జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం(కారం ఇష్టం లేనివారు పచ్చిమిర్చి వాడచ్చు), ఉప్పు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మనకు నచ్చిన ఆకారం లో చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎగ్స్ ని ఒక గిన్నె లో వేసి బాగా బీట్ చేయాలి. ముందుగా గ్రైండ్ చేసిన బ్రెడ్‌క్రంబ్స్ మరొక గిన్నె లో తీసుకోవాలి. మనకు నచ్చిన ఆకారం(Shape) లో చేసిన చికెన్ ని మొదట గుడ్డు మిశ్రమంలో ఇలా ముంచి అలా వెంటనే తీసి బ్రెడ్‌క్రంబ్స్(Bread crumbs) చికెన్ కి బాగా పట్టించి కాగిన నూనె లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా చూడాలి. అంతే మనకు ఇష్టమైన చికెన్ నగేట్స్ రెడీ. టొమోటో కేచప్(Tomato Ketchup) తో యమ్మి గా ఉంటుంది.