end
=
Friday, September 20, 2024
సినీమాRajeev Sen:భర్తకు చెప్పకుండా అలా చేసిన భార్య..
- Advertisment -

Rajeev Sen:భర్తకు చెప్పకుండా అలా చేసిన భార్య..

- Advertisment -
- Advertisment -

ప్రముఖ మోడల్(Popular Model) రాజీవ్ సేన్‌ తన భార్య, నటి చారు అసోపాతో విడిపోతున్నట్లు వస్తున్న పుకార్లపై మౌనాన్ని వీడాడు. అంతేకాదు ఇటీవల చారు చేసిన ఆరోపణలన్ని అవాస్తవాలేనంటూ కొట్టిపారేశాడు. ఇటీవల తన భార్య తననుంచి విడాకులు తీసుకోవాలనకుంటున్నట్లు సన్నిహితులతో(Close Friends) చెప్పిన తర్వాత విఫలమవుతున్న తమ ప్రేమ, వివాహా బంధాన్ని కాపాడుకోవడం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. అలాగే నిజానికి డివోర్స్(Divorce) తీసుకోవాలనకున్నది తాను కాదని, చారు మాత్రమే తననుంచి విడిపోవాలని కోరుకున్నట్లు వెల్లడించాడు.

‘ఈ ఆరోపణలన్నీ పూర్తిగా చెత్తవే. ఎందుకంటే నేను డెంటల్ అపాయింట్‌మెంట్ కోసం చివరిసారిగా ఢిల్లీ(Delhi)కి వెళ్లిన విషయం ఆమెకు తెలుసు. కానీ, వాస్తవానికి చాలా సందర్భాలలో చారు నాకు చెప్పకుండా ముంబాయి వెళ్లిపోయింది. ఆన్‌లైన్ వీడియోల ద్వారానే ఎక్కడ ఉందో తెలుసుకునే వాడిని. ఇప్పటికైనా చారు తన యూట్యూబ్ ప్రపంచం నుండి బయటపడి కుటుంబం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక అందమైన కుమార్తెతో ఆశీర్వదించబడ్డామని గుర్తించాలి. అహంకారం, చెడు స్నేహితులతో మన బంధాన్ని చంపుకోవద్దు. కూతురు ‘జియానా’(Jiyana) కోసం నేను డివోర్స్ నిరాకరించినట్లు మీడియాకు ఎవరు చెప్పారు? నా లాయర్ల ద్వారా చారుకి పంపిన అనేక లీగల్ నోటీసుల(Legal Notice)లో కుమార్తెను బాగా చూసుకోనని ఎప్పుడూ ప్రస్తావించలేదు. నా భార్యకు భరణం ఇవ్వాల్సిన అక్కర్లేదు. కూతురి ఆర్థిక అవసరాలు, చదువు ఇతరత్ర ప్రతిదానికి ఏ లోటు లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

(Kerala:నగ్నంగా నటించాల్సిందే.. ఫిమేల్ డైరెక్టర్ వార్నింగ్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -