end
=
Thursday, November 21, 2024
వార్తలుజాతీయంమారటోరియంపై వడ్డీలు విధించడం సరికాదుః సుప్రీంకోర్టు
- Advertisment -

మారటోరియంపై వడ్డీలు విధించడం సరికాదుః సుప్రీంకోర్టు

- Advertisment -
- Advertisment -
  • వడ్డీలు మాఫీ చేసే దిశగా ఆలోచించాలని కేంద్రానికి సూచన

కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీనివల్ల దేశంలో ప్రజల జీవనంపై చాలా ప్రభావాన్ని చూపించింది. ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకు రుణాలమీద మారటోరియం విధించింది. అయితే బ్యాంకులు మాత్రం మారటోరియం ఈఎంఐల మీద వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఈ విషయమై సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. రుణాల మీద వడ్డీలపై కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌.బి.ఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

(ఇక ‘అనంత’ ఆలయాన్ని దర్శించుకోవచ్చు)

బ్యాంకులు కేవలం లాభార్జనతో ప్రజల బాధలను దృష్టిలో పెట్టుకోకుండా మారటోరియం గడువు మీద కూడా వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను కష్టపెడుతున్నాయని ధర్మశాసనం విచారం వ్యక్తం చేసింది. అయితే మరాటోరియం కాలానికి రుణాల మీద వడ్డీలు మాఫీ చేయవచ్చా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విషయమై ఆర్‌.బి.ఐతో చర్చించాలని, అలాగే బ్యాంక్లరతో కూడా చర్చలు జపరాలని కోరింది.

(అడిషనల్‌ ఎస్పీని బలితీసుకున్న కరోనా వైరస్‌)

ఇప్పుడున్న కరోనా దుర్బర పరస్థితి దృష్ట్యా బ్యాంకులు కేవలం వ్యాపారం కోణంలోనే గాకుండా ప్రజల రుణ బాధల గురించి కూడా పట్టించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్(డీఎంఏ) కింద లోన్ మారటోరియం అంశంపై కేంద్రానికి అధికారాలు ఉన్నాయని ఉన్నతన్యాయస్థానం గుర్తు చేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ కేంద్రం, ఆర్బీఐ ఈ అంశంపై కలిసి పని చేస్తున్నాయని చెప్పారు.

(తగ్గుతున్న బంగారం, వెండి ధరలు)

కేంద్రం తప్పించుకోవడం లేదని అత్యున్నతన్యాయస్థానం ముందు ఉంచారు. అదే సమయంలో లోన్ మారటోరియంపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం కేసును సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. రుణాలు, ఈఎంఐల మారటోరియంకు సంబంధించి తమ అభిప్రాయం స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ఇదివరకే కేంద్రానికి, అలాగే ఆర్‌.బి.ఐకి ఆదేశాలు జారీ చేసింది.

(భారత్‌లో ‘ఆపిల్‌’ ఆన్‌లైన్‌ అమ్మకాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -