end
=
Friday, September 20, 2024
క్రీడలుCricket:భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు..
- Advertisment -

Cricket:భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు..

- Advertisment -
- Advertisment -

  • బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు వర్షం ముప్పు
  • ఇరుజట్లకు కీలకమేనంటున్న విశ్లేషకులు

T20 World Cup 2022: నవంబర్ (November)2న జరిగే మ్యాచ్ (Match) భారత్, బంగ్లాదేశ్ (India vs Bangladesh) రెండింటికీ కీలకమే. అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పు (Threat of rain) పొంచి ఉండడంతో అడిలైడ్‌లో టీమిండియా గెలిచే ఛాన్స్ కనిపించట్లేదు. దీంతో సెమీస్ (semis)ఆశలపై నీళ్లు చల్లినట్లేనంటూ అభిమానులు (fans) ఆందోళనలో ఉన్నారు. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ తన తదుపరి మ్యాచ్‌ను అడిలైడ్‌లో బంగ్లాదేశ్ టీంతో ఆడాల్సి ఉండగా.. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం పెర్త్ (perth)నుంచి టీమిండియా ఆటగాళ్లు అడిలైడ్ (Adelaide)చేరుకున్నారు.  అయితే ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా గెలవకపోతే మాత్రం భారీ నష్టం చవిచూడాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో బంగ్లాదేశ్‌తో టీమిండియా మ్యాచ్ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఇలా జరిగితే ఇరుజట్లకు కూడా ఆందోళనలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుంది.

నవంబర్ 2న అడిలైడ్‌లో మ్యాచ్. ఆ రోజు అక్కడి వాతావరణంలో (weather changes) మార్పులు ఉంటాయంట. వాతావరణ శాఖ (Department of Meteorology) ప్రకారం, ఆ రోజున ఆస్ట్రేలియా (Australia)నగరంలో వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రారంభమైన సమయంలోనే వాతావరణంలో ఇలాంటి మార్పు రానుండడంతో.. మ్యాచ్ జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అలా అయితే, మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? మ్యాచ్ లేనప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? అనే విషయాలు తెలుసుకుందాం..

(Virat Kohli:విరాట్ కోహ్లీ బెడ్‌రూమ్‌ వీడియో లీక్.. నెట్టింట వైరల్)

అడిలైడ్‌లో వర్షం..

అడిలైడ్ వాతావరణంపై వస్తున్న వార్తల ప్రకారం ఆ రోజు ఆకాశం మేఘావృతమై (Cloudy) ఉంటుంది. గంటకు 20-30 కిలోమీటర్ల (km) వేగంతో గాలులు వీస్తాయి. అయితే సాయంత్రం వర్షం కురుస్తుంది. నవంబర్ 2న, అడిలైడ్‌లో 60-70 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. అడిలైడ్‌లోని వాతావరణ ప్రభావం భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌పై ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ వాష్ అవుట్ (Wash out)అయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్, అదే జరిగితే గెలిచిన జట్టుకు 2 పాయింట్లు వస్తాయి.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఓడిపోవడం భారత్‌కు మంచి సంకేతం కాదు. ఎందుకంటే ఇది సెమీ-ఫైనల్ సమీకరణాన్ని పాడు చేస్తుంది. టీమ్ ఇండియా దృష్టిలో ఒక మ్యాచ్ ఉండి గెలిస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో (points table) రెండు జట్ల పరిస్థితిని ఇప్పుడు అర్థం చేసుకుందాం. రెండు జట్లు గ్రూప్ 2లో (group 2)ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా (south africa)5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ కూడా భారత్‌తో సమానంగా 4 పాయింట్లను కలిగి ఉంది. భారత్ తర్వాత మూడవ స్థానంలో ఉంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య పాయింట్ల పట్టికలో తేడా ఒక్క రన్ రేట్ (run rate)విషయంలోనే ఉంది. నవంబర్ 2న అడిలైడ్‌లో జరిగే మ్యాచ్‌కు ఇది చాలా కీలకంగా మారనుంది. అందుకే ఇక్కడ రెండు జట్లూ గెలవాల్సిన అవసరం ఉంది. ఇదిలావుంటే.. దినేష్ కార్తీక్ (dinesh karthik)వెన్ను నొప్పితో (back pain)బాధపడుతున్నాడని పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (bhuvneshwar kumar) ధృవీకరించాడు. వైద్యుల నివేదిక తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుందని అన్నాడు. పాకిస్తాన్ తో (pakistan)జరిగిన మ్యాచ్ లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన.. టీ20 ప్రపంచకప్ (world cup)కు ముందు టీమిండియా ఆటగాళ్లను వేధించిన గాయాల సమస్య మళ్లీ వెంటాడుతోంది.

ఇప్పటికే గాయం కారణంగా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా (bumrah)టీ20 ప్రపంచకప్ కు దూరం కాగా.. తాజాగా దినేష్ కార్తీక్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. దీంతో తరువాత మ్యాచ్ లకు దినేష్ కార్తీక్ అందుబాటులో ఉండటం అనుమానమే. టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచుల్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో (south africa)జరిగిన మ్యాచ్‌లో కీలక ఆటగాడు దినేష్ కార్తీక్ వెన్ను గాయానికి గురయ్యాడు. దీంతో ఆడిలైడ్ లో నవంబర్ రెండో తేదీన బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ కు దూరం కానున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో బౌన్స్, స్వింగ్‌ బాల్స్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో 15 బంతుల్లో (balls)ఆరు పరుగులు (runs) మాత్రమే చేయగలిగాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో 15 ఓవర్ల ముగిసిన తర్వాత మైదానం వీడి వెళ్లాడు. దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ (pant)కీపింగ్ చేశాడు. గాయం తీవ్రతపై స్పష్టత లేకపోయినా నవంబర్ రెండో తేదీ బుధవారం బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ కు దినేష్ కార్తీక్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువుగానే ఉన్నట్లు తెలుస్తోంది.

(Nizam College : నిజాం కళాశాల విద్యార్థుల నిరసన)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -