end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంMunugode by Elections :రాజగోపాల్ రెడ్డికి చెప్పులు చూపించిన ఓటర్లు..
- Advertisment -

Munugode by Elections :రాజగోపాల్ రెడ్డికి చెప్పులు చూపించిన ఓటర్లు..

- Advertisment -
- Advertisment -

  • చౌటుప్పల్‌-హైదరాబాద్‌ రోడ్డుపై ఉద్రిక్తత
  • గో బ్యాక్ అంటూ ప్రజల వ్యతిరేక నినాదాలు

మునుగోడు (Munugode) ఉప ఎన్నికల (By-elections) ప్రచారం పోటాపోటీగా నడుస్తోంది. ప్రధాన పార్టీల లీడర్లతోపాటు మిగతా చిన్న పార్టీ నేతలు సైతం తమదైన స్టైల్‌లో ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అయితే ప్రచారానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో తదితర పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని రాత్రి కూడా కొనసాగిస్తున్నారు. అందుబాటులో ఉన్న గ్రామాలన్నింటినీ కలియదిరిగుతూ వినూత్న ప్రచారం చేస్తున్నారు.

అయితే ఈ ప్రచారంలో చౌటుప్పల్‌-హైదరాబాద్‌ (Choutuppal- Hyderabad) రోడ్డుపై ఉద్రిక్తత కనిపించింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ అభ్యర్థి (BJP candidate) రాజగోపాల్‌రెడ్డిని ( Rajagopal Reddy) అడ్డుకున్నారు స్థానిక టీఆర్‌ఎస్ కార్యకర్తలు. గతంలో ఎమ్మెల్యేగా (MLA)గెలిచిన తర్వాత రాజగోపాల్ ఒక్కసారి కూడా తమ గ్రామానికి (Village)రాలేదని, ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు కూడా వెళ్లిపోవాలంటూ డిమాండ్ (demand) చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు (slogans)చేశారు. రాజగోపాల్ గోబ్యాక్ (go back)అంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓ వ్యక్తి చెప్పులు చూపించాడు. దాంతో.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వేదికపై నుంచి రాజగోపాల్ కూడా సీరియస్‌గానే రియాక్ట్ (serius react)అయ్యారు. వెంటనే బీజేపీ కార్యకర్తలూ (BJP activists) రియాక్ట్‌ అయ్యారు. దాంతో బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS) రెండు పార్టీల కార్యకర్తల మధ్య కాసేపు వాగ్వాదం, ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలర్ట్ అయిన పోలీసులు (Police) రెండు వర్గాలను కట్టడి చెశారు. దాంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

(CM Jagan:అలీ కూతురి పెళ్లికి సీఎం జగన్‌ భారీ కానుక..)

ఇదిలావుంటే.. మునుగోడు బైపోల్‌ ప్రచారం మంగళవారం (Tuesday) సాయంత్రం (Evening) 6 గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ (Vikas Raj) తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ (Webcasting at polling stations)ఏర్పాటు చేశామని తెలిపారు. 199 మంది మైక్రో అబ్జర్వర్లు (Micro observers), రెండు జీఎస్టీ టీమ్‌ (GST Team)లు నియమించినట్లు వెల్లడించారు. ఇక ఇప్పటివరూ 6.8 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామ సీఈసీ వికాస్‌రాజ్‌ వెల్లడించారు. 185 కేసులు (case) నమోదు చేశామని వివరించారు. ఈ మేరకు వికాస్ రాజ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. నల్గొండ (Nalgonda) జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలో 2.41లక్షల మంది ఓటర్లు (Voters) ఉన్నారని తెలిపారు. వారిలో 50 మంది సర్వీసు ఓటర్లు (Service voters) ఉన్నారని పేర్కొన్నారు. నవంబరు 3న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి రేపటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుందని.. అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా 80 ఏళ్లు దాటిన ఓటర్లు 2,576 మంది ఉన్నారని.. పోస్టల్‌ బ్యాలెట్‌ (Postal Ballot)ఓటర్లు 5,686 మంది ఉన్నారని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వృద్ధులకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

అలాగే ఈ ఉపఎన్నికకు మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలు (Polling stations)ఏర్పాటు చేసినట్లు వికాస్‌రాజ్‌ తెలిపారు. అర్బన్‌ (Urban) పరిధిలో 35, రూరల్‌ (Rural)పరిధిలో 263 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిట్లు తెలిపారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి తొలిసారిగా డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డు (Digital Voter Identity Card)లను మంజూరు చేశామన్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులను (slips) పంపిణీ చేశామని, ఆన్‌లైన్‌లోనూ (online)అందుబాటులో ఉన్నాయని వివరించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. మాక్‌పోలింగ్ (Mock polling) దృష్ట్యా గంట ముందుగా ఏజెంట్లు రావాలని సూచించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ (Presiding Officer), ముగ్గురు ఆఫీసర్లు ఉంటారని తెలిపారు.

నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1,192 మంది సిబ్బంది అవసరం కాగా.. 300 మందిని అదనంగా ఉంచామని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బూత్‌లెవెల్‌ ఆఫీసర్లు (Booth Level Officers) ఉంటారని, అన్ని చోట్లా మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మునుగోడు పరిధిలో 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టులు (check post) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.6.80 కోట్ల నగదు (cash), 4,560 లీటర్ల మద్యం (alcohol) స్వాధీనం చేసుకున్నామని, 185 కేసులు నమోదు చేశామని చెప్పారు. ఫిర్యాదుల కోసం సీవిజల్‌ యాప్‌ (SeaVisual app)ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

నేరుగా పోలింగ్‌ కేంద్రం (Poling Center) నుంచే ప్రతిగంటకు ఓటింగ్‌ శాతం నమోదు చేస్తామని తెలిపారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా రేపు సాయంత్రం 6 గంటల తర్వాత విస్తృత తనిఖీలు (Extensive inspections)చేపడతామని, బయటి నుంచి వచ్చిన వారు నియోజవర్గంలో ఉండకూడదని సూచించారు. ఎస్‌ఎంఎస్‌ల (SMS)పైనా నిషేధం ఉందని.. దీనికి అనుగుణంగా నెట్‌వర్క్‌ ప్రొవైడర్లు (Network providers)తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నియమ నింబంధనలను కచ్చితంగా పాటించి పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.

(Munugode:మునుగోడు కేసీఆర్ బహిరంగ సభపై సర్వత్ర ఉత్కంఠ..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -