end
=
Sunday, November 24, 2024
వార్తలురాష్ట్రీయంTelangana:తెలంగాణలో ముగియనున్న భారత్ జోడో యాత్ర..
- Advertisment -

Telangana:తెలంగాణలో ముగియనున్న భారత్ జోడో యాత్ర..

- Advertisment -
- Advertisment -

మేనూరులో రాహుల్ బహిరంగ సభతో లాస్ట్

మద్నూరు మీదుగా మహారాష్ట్రకు పయనం

ఏఐసీసీ (AICC) అగ్రనేత రాహుల్​గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) రాష్ట్రంలో ముగియనున్నది. సోమవారం (Monday evening) సాయంత్రం ఆరు గంటల తర్వాత మహారాష్ట్రలో (Maharashtra)అడుగుపెట్టనున్నది. అంతకు ముందు మద్నూరు మండలం మేనూరులో (Menoor) భారత్ జోడో గర్జన (Bharat jodo garjana) పేరుతో కాంగ్రెస్ రాష్ట్ర నేతలు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రసంగం తర్వాత రాహుల్ గాంధీ మహారాష్ట్రకు వెళ్లనున్నారు. 

రాష్ట్రంలో భారత్​జోడో యాత్ర విజయవంతమైంది. రాహుల్ వెంట వేలమంది (10 thousand) జనం కలిసి నడిచారు. అన్ని వర్గాలతో సమావేశమవుతూ.. తెలంగాణ కళా ప్రదర్శనలను తిలకిస్తూ రాహుల్ యాత్ర సాగించారు. అదేసమయంలో దేశంలోని సమస్యలతో పాటుగా రాష్ట్రంలో కేసీఆర్​(KCR) పాలనను టార్గెట్​చేస్తూ ప్రసంగించారు. రాష్ట్రంలో మొత్తం 16 రోజుల షెడ్యూల్ ఉండగా.. నాలుగు రోజులు బ్రేక్​తీసుకున్నారు. అయితే, యాత్ర సందర్భంగా రాష్ట్రానికి సోనియా (Sonia), ప్రియాంక (Priyanka)వస్తారని ఏఐసీసీ ప్రకటించినా.. పలు కారణాలతో వారి పర్యటన (Tour cancel) రద్దు అయ్యింది. ఓవైపు మునుగోడు (Munugode)ఉప ఎన్నిక ప్రచారం ఉండటంతో.. రాహుల్​యాత్రకు ప్రత్యేకంగా 13 కమిటీలను ప్రకటించారు. వీటిని సమన్వయం చేసుకుంటూ యాత్రను విజయవంతం చేశారు. అయితే, జోడో యాత్ర సాగుతుండగానే.. మునుగోడు బైపోల్ లో ఓడిపోవడం పార్టీ నేతల్లో కొంత నిరుత్సాహం కలిగించింది. కానీ, ఈ యాత్రకు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

(PM Modi:తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న భారత ప్రధాని)

తెలంగాణ (Telangana) గడ్డ మీద జోడో యాత్ర నిర్వహించినందుకు కృతజ్ఞతగా ఘనంగా వీడ్కోలు పలికేందకు కామారెడ్డి (Kamareddy)జిల్లా జుక్కల్ (Jukkal)నియోజకవర్గం మద్నూర్ (Madnoor)మండలంలోని మేనూరు గ్రామంలో భారత్ జోడో గర్జన సభను నిర్వహిస్తున్నట్లుగా టీపీసీసీ (TPCC) ప్రకటించింది. కేవలం పాదయాత్ర మాత్రమే కాకుండా.. దారి వెంట ప్రజల సమస్యలను రాహుల్ తెలుసుకున్నారు. రైతులు (FORMERS), నిరుద్యోగులు (Unemployed) తదితర అంశాలను కాంగ్రెస్​మేనిఫెస్టోలో (Manifesto)పెట్టాలని సూచించారు. పాదయాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)తో పాటుగా ఏఐసీసీ సీనియర్లు కేసీ వేణుగోపాల్ (venugopal)​, దిగ్విజయ్​ సింగ్ (digvijay singh)​, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి ఠాగూర్ (Tagoor), ఏఐసీసీ కార్యదర్శులు, సామాజికవేత్త ప్రశాంత్​భూషణ్ (Prashant bhushan)​, రాష్ట్రంలోని పలువురు కీలక నేతలు మంద కృష్ణ (Manda krishna) సహా పలువురు రాహుల్​వెంట నడిచారు. రాహుల్​ పాదయాత్రకు రాష్ట్ర ప్రజలు నీరాజనం పలికారని టీపీసీసీ చీఫ్​రేవంత్ (Revanth reddy)​ రెడ్డి పేర్కొన్నారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం శాంతియుత పోరాటం చేసిన మహాత్మా గాంధీతోపాటు (Gandhi) దేశం కోసం ప్రాణాల్పరించిన ఇందిరా గాంధీ (Indira gandhi), రాజీవ్ గాంధీ (Rajiv gandhi)స్ఫూర్తితో రాహుల్ ఈ పాదయాత్ర చేపట్టారని వెల్లడించారు. ఈడీ (ED), సీబీఐ (CBI) దాడులు చేసినా, ప్రాణాలకు ప్రమాదం ఉందని నిఘూ వర్గాలు హెచ్చరించిన వెనకడుగు వేయలేదని అన్నారు. రాహుల్​గాంధీకి కృతజ్క్షత చెప్తూ మేనూర్​ లో నిర్వహించే భారత్​జోడో గర్జనను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. రాహుల్ గాంధీని ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రజలు చూస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ మధుయాష్కీ (Madhu Yashki) అన్నారు.

(BJP:ఉప ఎన్నికల్లో బీజేపీకే సానుకూల ఫలితాలు..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -