end
=
Sunday, November 24, 2024
వార్తలుజాతీయంMadhya Pradesh:ఆ గ్రామంలో పిల్లలు కనడం నిషేధం
- Advertisment -

Madhya Pradesh:ఆ గ్రామంలో పిల్లలు కనడం నిషేధం

- Advertisment -
- Advertisment -

  • 400 ఏళ్లుగా కొనసాగుతున్న మూఢనమ్మకం
  • ప్రసవిస్తే మరణం తప్పదంటున్న గ్రామ ప్రజలు

ప్రపంచవ్యాప్తంగా (World Wide)ఎన్నో వింత ఆచారాలు (Customs), సంప్రదాయాలుం(Traditions)టాయి. అయితే ముఖ్యంగా భారతదేశం (India) లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వెనబాటుతనంతో కూడిన అజ్ఞానం (Ignorance)మరింత ఎక్కువగా ఉంటుంది. నరబలి, దిష్ఠి, తదితర మూడనమ్మకాలతో ఎన్నో కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లల (Childrens) విషయంలో శాస్త్రీయమైన పద్ధతుల (Scientific methods)ను పాటించకుండా మంత్రాలు, తాయత్తులంటూ పసిపిల్లల ప్రాణాలను కొంతమంది తల్లిదండ్రులు (Parents) బలితీసుకుంటారు. అచ్చం అలాంటి దారుణమైన కల్చర్ (Culture) భారత దేశంలోని మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh)చెందిన సంకశ్యామ్‌ జీ గ్రామ (Sankashyamji village) ప్రజలు (People) పాటిస్తున్నారు. అంతేకాదు తమ ఊరి పేరు చెప్పేందుకే కూడా భయపడటం విశేషం.

ఒక్కసారిగా మూఢనమ్మకాలు ప్రబలితే.. అందులోంచి మనుషులను బయటకు తీయడం అసాధ్యంతో కూడుకున్న పని. ఇప్పటికీ భారత్‌లోని చాలా గ్రామాలు మూఢ నమ్మకాల్లో మునిగి తేలుతున్నాయి. అలాంటి ఓ గ్రామమే మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉంది. రాష్ట్ర రాజధాని భోపాల్ (Bopal)నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌గఢ్‌ (Rajgad) జిల్లాలోని సంకశ్యామ్‌ జీ గ్రామంలోని ప్రజలు ఇప్పటికీ.. ఓ శాపానికి భయపడుతూ జీవిస్తున్నారు. ఎవరైనా తాము పుట్టిన ప్రదేశం గురించి గొప్పగా చెప్పుకుంటారు. అయితే వీరు అలా కాదు. తమ గ్రామం పేరు చెప్పుకోవడానికే జడుసుకుంటారు. ఈ గ్రామంలో పిల్లల్ని కనడం పూర్తిగా నిషేధం. ఒక వేళ ఎవరైనా గర్భం దాలిస్తే ఊరి చివరకో లేదంటే వేరే గ్రామానికో వెళ్లి కనాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ గ్రామంలో ఎవరైనా గర్భిణీ (Pregnant) ప్రసవం (delivery) పోసుకుంటే సదరు శిశువు (baby) మరణిస్తుందని, లేదా అంగవైకల్యం (Disability)తో ఉంటారని గ్రామ ప్రజలు నమ్ముతారు. ఊరికి శాపం ఉందని, అందుకే గ్రామంలోని మహిళలు ఊరి బయటకు పిల్లల్ని కంటారు. వర్షకాలంలోనైనా సరే.. ఊరి బయట పందిరి వేసుకుని పిల్లలకు జన్మనిస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎంతా చెప్పినా అక్కడి గ్రామస్తులు పట్టించుకోరు. సంకశ్యామ్‌ జీ గ్రామంలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చి 400 ఏళ్లు (Years) పూర్తయ్యాయి. ఇప్పటికి ఆ ఊరిలో ఒక్క ఆస్పత్రికి లేదు. ఇక బాలింతలకు ప్రభుత్వం నుంచి అందే సహకారాలు కూడా అందవు.

ఒక స్త్రీ ఆలయ (Temple) నిర్మాణాన్ని అడ్డుకోవడంతో ఈ గ్రామంపై శాపం ఏర్పడిందట. 16వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఒక మహిళ గోధుమలు (wheat) రుబ్బడం ప్రారంభించిందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. దీంతో నిర్మాణ పనులు చెదిరిపోయాయని, కోపంతో దేవుళ్లు ఈ గ్రామంలో ఏ ఆడబిడ్డ జన్మనివ్వకూడదని శాపనార్థాలు పెట్టారని నమ్ముతారు. ఈ మూఢనమ్మకాన్ని గ్రామస్తులు ఇప్పటికీ నమ్ముతున్నారు. కొన్ని ప్రమాదవశాత్తు ప్రసవాలు జరిగినప్పుడు, పిల్లవాడు వైకల్యంతో చనిపోయాడని తాము ప్రత్యక్షంగా చూశామని గ్రామస్తులు చెప్పారు. ఈ ఊరిలో ఎవరూ మద్యం (Wine) సేవించరని, మాంసం (Nonveg)తినరని, అది తమ గ్రామానికి దేవుడిచ్చిన వరం అని గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు చెబుతున్నాడు. దీంతో 400 ఏళ్లుగా ఆ గ్రామంలో మహిళ బిడ్డకు జన్మ ఇవ్వలేదు. ఒకవేళ నెలలు నిండిన మహిళ బిడ్డను కనాలంటే ఆమె ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా.. ఊరు దాటి బిడ్డకు జన్మనివ్వాలే తప్ప ఊర్లో కనకూడదని భీష్మించుకుని కూర్చున్నారు. ఒకవేళ గ్రామంలో బిడ్డను కంటే తల్లీ బిడ్డల్లో ఒకరు మృతి (ded) చెందుతారని నమ్ముతారు. లేదా పుట్టబోయే బిడ్డ లోపాలతో పుడుతారని విశ్వసిస్తారు.

(Group 4 Notification:తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌!)

గ్రామాన్ని శపించిన దేవుళ్లు

16వ శతాబ్దం (16th century)లో దేవుళ్లు ఆ గ్రామంలో ఓ ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో ఓ మహిళ గోధుమలను ఇసురురాయిలో వేసి ఇసురుతుండగా దేవుళ్లు చేస్తున్న పూజకు భంగం కలిగిందట. దీంతో కోపోద్రిక్తులైన దేవుళ్లు గ్రామాన్ని శపించారట. ఈ గ్రామంలో ఏ మహిళ కూడా బిడ్డకు జన్మ ఇవ్వలేదని ఒకవేళ ఇస్తే ఇద్దరు మరణిస్తారని అన్నారట. అప్పనుంచి ఊరి బయటే కాన్పులు జరుగుతాయి. దేవుళ్లు (gods)గ్రామాన్ని శపించారని గ్రామస్తులు బలంగా నమ్ముతుండటంతో 90 శాతం డెలివరీలు గ్రామం బయట ఉన్న ఆస్పత్రుల్లో (Hospital) జరుగుతాయని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో డెలివరీలు గ్రామపొలిమేర్లలో జరుగుతాయని గ్రామ సర్పంచ్ నరేంద్ర గుర్జర్(Village Sarpanch Narendra Gurjar) చెప్పాడు. ఆలయం నిర్మాణంలో ఉండగా మహిళ తన చర్యలతో దేవుళ్ల దృష్టిని మరల్చడంతోనే గ్రామాన్ని శపించారన్న ఆయన అప్పటి నుంచి నేటి వరకు గ్రామంలో మహిళలు పిల్లలకు జన్మనివ్వరని, ఒకవేళ అత్యవసరం (Emergency) అయితే కేవలం కాన్పులకోసమే ఊరి బయట ఒక గదిని(Room) నిర్మించినట్లు వివరంగా చెప్పుకొచ్చాడు. ఈ మూడ నమ్మకం గురించి విన్న నెటిజన్లు (Netizens) టెక్నాలజీ (Technology) డెవలప్ అవుతున్న రోజుల్లోనూ ఇలాంటి మనుషులున్నారా? అంటూ ఆశ్చర్యవ్యక్తం చేస్తూ ముక్కున వేలేసుకుంటున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -