- అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న ‘విక్రమ్-ఎస్’
- శ్రీహరికోట నుంచి నవంబర్ 16లోపు లాంచింగ్
హైదరాబాద్ (Hyderabad)కు చెందిన అంతరిక్ష సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Space Agency ‘Skyroot Aerospace’).. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ (private rocket) ‘విక్రమ్-ఎస్’ (Vikram S)ను ఈ నెల 12-16 మధ్య ప్రయోగించనున్నట్లు తెలిపింది. స్కైరూట్ ఏరోస్పేస్ మొదటి మిషన్ ‘ప్రారంభ్’ (Prarambh)లో భాగంగా ఈ రాకెట్ మూడు కస్టమర్ పేలోడ్స్ (Customer payloads)ను మోసుకెళ్లనుంది. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ (Sriharikota Launch Pad) నుంచి ప్రారంభించబడనుంది.
నవంబర్ 12, 16 మధ్య లాంచ్ విండో ఉండనుందని నోటిఫై చేసిన అధికారులు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఫైనల్ డేట్ (Final date) నిర్ధారించారు’ అని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈవో, కో-ఫౌండర్ పవన్ కుమార్ చందన (Aerospace CEO, Co-Founder Pawan Kumar Chandana)తెలిపారు. ఈ మిషన్‌తో ‘స్కైరూట్ ఏరోస్పేస్’.. ఇండియాలో ప్రైవేట్ స్పేస్ ఎంటర్‌ప్రైజ్ (Private space enterprise in India)గా మొదటిసారి రాకెట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. ఇది ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని అనుమతించడానికి 2020లో తెరవబడిన స్పేస్ ఇండస్ట్రీ (Space industry)కోసం కొత్త శకానికి నాంది పలికింది.
‘విక్రమ్-ఎస్’ రాకెట్ అనేది సింగిల్ స్టేజ్ సబ్-ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ (Stage Sub-Orbital Launch Vehicle). ఇది మూడు కస్టమర్ పేలోడ్స్‌ను తీసుకెళ్లగలదు. ఈ విక్రమ్ సిరీస్ అంతరిక్ష ప్రయోగ వాహనాల్లోని మెజారిటీ సాంకేతికతలను పరీక్షించడానికి, ధృవీకరించడానికి సాయపడుతుంది’ అని స్కైరూట్ ఏరోస్పేస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నాగ భరత్ డాక (Skyroute Aerospace Chief Operating Officer Naga Bharath Daka) ఒక ప్రకటనలో తెలిపారు. స్కైరూట్ విక్రమ్-ఎస్ రాకెట్ మిషన్‌ను ఇంత తక్కువ సమయంలో నిర్మించి పూర్తిచేయడానికి ఇస్రో, In-SPACe (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) సహాయమే ప్రధాన కారణమని చందన పేర్కొన్నారు.
(Whatsapp:వాట్సాప్‌లో ప్రతి మెసేజ్‌కు రిప్లయ్ ఇస్తున్నారా?)
ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్‌కు మార్గదర్శకుడు, ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ (Scientist Vikram Sarabhai) గౌరవార్థం.. స్కైరూట్ ప్రయోగ వాహనాలు ‘విక్రమ్’ అనే పేరును కలిగి ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఈ ‘స్కైరూట్’ కంపెనీ వాణిజ్య ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు అత్యాధునిక స్పేస్ లాంచింగ్ వెహికల్స్‌ను తయారు చేస్తోంది. ప్రతి ఒక్కరికీ స్పేస్ ఫ్లైట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా విశ్వసనీయంగా, క్రమబద్ధంగా చేయడానికి దాని మిషన్‌ను విస్తరించడం ద్వారా ఖర్చుతో కూడుకున్న ఉపగ్రహ ప్రయోగ సేవలు (Satellite launch services), అంతరిక్ష ప్రయాణానికి ప్రవేశ అడ్డంకులను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది.