end
=
Thursday, November 21, 2024
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీQuantum computer:కొత్త సూపర్ ఫాస్ట్ ‘క్వాంటమ్’ కంప్యూటర్
- Advertisment -

Quantum computer:కొత్త సూపర్ ఫాస్ట్ ‘క్వాంటమ్’ కంప్యూటర్

- Advertisment -
- Advertisment -

  • సూపర్ ఫాస్ట్ క్వాంటమ్ ప్రాసెసర్‌ను డెవలప్ చేసిన IBM
  • వరల్డ్‌లో ఏ ప్రాసెసర్‌తో పోల్చుకున్నా ఇదే అతిపెద్ద క్విట్


ప్రముఖ టెక్నాలజీ కంపెనీ (Technology company) IBM.. కొత్త సూపర్ ఫాస్ట్ క్వాంటమ్ ప్రాసెసర్‌ (Super fast quantum processor)ను డెవలప్ చేసింది. ఓస్ప్రే(Osprey) అనేది 433-క్వాంటమ్ బిట్(qubit) ప్రాసెసర్. వరల్డ్‌లో ఏ ప్రాసెసర్‌తో పోల్చుకున్నా ఇది అతిపెద్ద క్విట్ కౌంట్ కలిగి ఉంది. క్వాంటమ్ బిట్స్ అంటే.. క్లాసిక్ కంప్యూటింగ్‌లో టాస్క్‌ల నిర్వహణకు ప్రాసెసర్లు ఒకటి, జీరో(బిట్స్)పై ఆధారపడి ఉంటాయి. అయితే, క్వాంటమ్ కంప్యూటిరింగ్‌లో (Quantum Computer) క్విట్స్ ఒకే సమయంలో ఒకటి, జీరోతో పాటు ఒకటిని సూచిస్తాయి. అంటే ఇవి క్లాసికల్ కంప్యూటర్స్‌కు క్లిష్టమైనటువంటి పనులు, గణనలను కూడా నిర్వహించగలవు.ఐబీఎం.. 2021లో 127 క్విట్స్ కలిగిన ఈగల్ ప్రాసెసర్‌ (Eagle Processor)ను ఆవిష్కరించింది. ఇప్పుడు ‘ఓస్ప్రే’ దానిని ఒక మెట్టు పైకి తీసుకెళ్లింది. ఈ ఓస్ప్రే ప్రాసెసర్‌లో ఒక స్థితిని సూచించడానికి అవసరమైన క్లాసికల్ బిట్స్ (Classical bits) సంఖ్య మనకు తెలిసిన విశ్వంలోని మొత్తం అణువుల సంఖ్యను మించిపోయింది’ అని ఒక పత్రికా ప్రకటన పేర్కొంది.

గతంలో పరిష్కరించలేని సమస్యలు పరిష్కరించడం :


కొత్త 433 క్విట్ ‘ఓస్ప్రే’ ప్రాసెసర్.. గతంలోని అపరిష్కృత సమస్యలు పరిష్కరించేందుకు క్వాంటమ్ కంప్యూటర్లను ఉపయోగించే పాయింట్‌కు దగ్గరలో ఉందని IBM సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ డారియో గిల్ (Research Director Dr. Dario Gil) అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా పార్ట్‌నర్స్, క్లయింట్స్‌ (Partners, Clients)తో కలిసి ఈ కాలంలోని అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, క్లాసికల్ ఇంటిగ్రేషన్‌ (Hardware, software, classical integration)లో మా క్వాంటమ్ టెక్నాలజీని (Quantum technology)అభివృద్ధి చేయడంపై నిరంతరం పనిచేస్తున్నాం. ఈ పని రాబోయే క్వాంటమ్-సెంట్రిక్ సూపర్‌కంప్యూటింగ్ (Quantum-Centric Supercomputing)యుగానికి పునాదిగా రుజువు చేస్తుంది’ అని తెలిపారు.

(Airtel 5G : అందుబాటులోకి ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు)

క్లాసికల్ కంప్యూటర్స్‌ (Classical computers)తో పోల్చినప్పుడు క్వాంటమ్ కంప్యూటర్లు ఈ సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్స్ ఉపయోగించి ఎక్కువ డేటాను ప్రాసెస్ చేయగలవు. ఒక వస్తువు స్థితిని కొలవడానికి ముందే దాని సంభావ్యత ఆధారంగా గణనలను నిర్వహించగలవు. ముఖ్యంగా ఒక వస్తువు క్వాంటమ్ స్థితి.. అంటే, వస్తువు యొక్క నిర్వచించబడని శాస్త్రీయ లక్షణాలు ఆధారంగా గణనలు నిర్వహించబడతాయి. IBM బ్లాగ్ ప్రకారం.. ఈ 433 క్విట్ ప్రాసెసర్ యూజర్లు (Quit processor users)‘అధునాతన దోష నివారణ వ్యూహాలను’ పొందవచ్చు. కాగా 2025 నాటికి 4,000+ క్విట్‌ల లక్ష్యాన్ని చేరుకోవాలని IBM కోరుకుంటోంది. ఇక 2023 నాటికి IBM నుంచి రెండో క్వాంటమ్ సిస్టమ్ విడుదలవుతుంది. ఇక ‘మల్టిపుల్ ప్రాసెసర్స్‌ను కమ్యూనికేషన్ లింక్స్‌తో ఒకే సిస్టమ్‌గా కలపడం’ (Combining multiple processors into a single system with communication links’) ద్వారా ఈ సిస్టమ్.. మాడ్యులర్, ఫ్లెక్సిబుల్‌గా రూపొందించబడింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -