- యూజీసీ మార్గదర్శకాలను సమర్థించిన సుప్రీంకోర్టు
దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని కళాశాలలు, పాఠశాలలు, యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు పాఠశాలల విద్యార్థులను డైరెక్టుగా పైతరగతులకు పరీక్షలు లేకుండా ప్రమోట్ చేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కళాశాలలు, యూనివర్సిటీ విద్యార్థుల పరీక్షలు ఇంకా నిర్వహించలేదు.
మాల్యా రివ్యూ పిటిషన్‌పై ఉత్తర్వులు రిజర్వు
అయితే ఈ విషయమై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) మార్గదర్శకాలు జారీ చేసింది. కచ్చితంగా కళాశాలల, వర్సిటీల విద్యార్థుల ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే పై తరగుతులకు ప్రమోట్ చేయాలని ఇటీవల మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఈ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
సెప్టెంబర్ 30లోపు పరీక్షలు నిర్వహించాలని యుజిసి నిబంధనలను సమర్థించింది. ఎట్టి పరిస్థితుల్లో కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులు ఫైనల్‌ఇయర్ పరీక్షలకు హాజరుకావాల్సిందేదని జస్టిస్ అశోక్‌భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇదిలావుంటే పరీక్షల నిర్వహణ ఎలా చేపట్టాలి, పరీక్షల గడువు ఇతరత్రా ఇబ్బందుల గురించి యూజీసిన సంప్రదించాలని కోర్టు తెలియజేసింది.