- ఫిబ్రవరినాటికి పూర్తి కావాలని అధికారులకు ఆదేశం
తెలంగాణ (Telangana) హైదరాబాద్ (Hyderabad) రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ (Secretariat)పనుల్ని నిశితంగా పరిశీలించారు సీఎం కేసీఆర్ (CM KCR). అంతేకాదు ఫిబ్రవరి (February) నాటికి పనులన్నీ పూర్తి కావాలని ఆదేశం ఇచ్చాడు. ఫార్ములా ఈ ఛాంపియన్ షిప్ (Formula E Championship) మొదలయ్యేలోపు సచివాలయం సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. అయితే ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి? ఫార్ములా రేసింగ్‌కి సెక్రటేరియట్ పూర్తికావడానికి ఉన్న లింకేంటని ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
నూతన సచివాలయ నిర్మాణ పనుల్ని పరిశీలించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. పనులు తుది దశకు చేరుకున్నాయి. 90 శాతం నిర్మాణం పూర్తయింది. ఇంటీరియర్, నెట్‌వర్క్, లాండ్ స్కైప్, పార్కింగ్ (Interior, Network, Landscape, Parking)పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. సచివాలయం లోపల నిర్మిస్తున్న టెంపుల్, మసీద్ వర్క్స్ (Temple and Masjid Works)కూడా జరుగుతున్నాయి. అయితే మ్యాన్ పవర్‌ను మరింత పెంచి.. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్ . ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం నాటికి మొత్తం నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో తొలిసారి అంతర్జాతీయ స్థాయి ఫార్మూలా రేస్ (International level formula race) జరుగుతోంది. ట్రయల్ రన్ తర్వాత ఫిబ్రవరిలో అసలు రేస్ మొదలవుతుంది. ఈ ఈవెంట్‌కి ఇంటర్నేషనల్ మీడియా (International Media)వస్తుంది. వరల్డ్‌వైడ్‌గా టెలికాస్ట్ (Telecast worldwide)అవుతుంది. ఆ లోగా సెక్రటేరియట్‌ను సిద్ధం చేస్తే స్పెషల్ అట్రాక్షన్ (Special attraction)గా ఉంటుదని ప్రభుత్వం ఆలోచన.
తెలంగాణ హెడ్‌క్వార్టర్స్(Headquarters)గా అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుందని భావిస్తోంది. ఆలోపు పనులు పూర్తిఅయ్యేలా టార్గెట్ పెట్టుకుంది. ఇక సచివాలయంలో వాడే ఫర్నీచర్‌ను కూడా సీఎం కేసీఆర్ సెలక్ట్ చేశారు. హై సెక్యూరిటీతో కూడిన నెట్‌వర్కింగ్ (Networking with high security)ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సమాచారం లీక్ కావడం.. హ్యాకింగ్ (Hacking)కి గురికావడం వంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇక 617 కోట్లతో నిర్మితమవుతున్న నూతన సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ (Green building concept)పద్ధతిలో నిర్మిస్తున్నారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) పేరుని ఖరారు చేశారు. అంతకుముందు సెక్రటేరియట్‌లో పలు సమీక్షలు నిర్వహించారు సీఎం కేసీఆర్. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు (kanti velugu)కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్ (Medak District Malkapur)లో ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఐదు నెలల పాటు కొనసాగింది. సమస్యలు ఉన్నవారికి కళ్లద్దాలు కూడా పంపిణీ చేసింది. మరోసారి ఈ ప్రోగ్రామ్‌ను చేపట్టాలని ఆదేశించారు. అలాగే రోడ్లుభవనాల శాఖపైనా సమీక్షించారు. ఇటీవలి వర్షాలకు పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతుల కోసం చేపట్టాల్సిన పనులు, నిధులపై చర్చించారు.