- అంతరించిపోతున్న జాతుల జాబితాలో ‘లెస్సర్ ప్రైరీ-చికెన్’
- మాంసహారం కోసం దీన్ని వాడకూడదని ఆదేశాలు జారీ
- అధికారికంగా వెల్లడించిన ‘ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్’
అంతరించిపోతున్న అడవి జాతుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ‘ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం(World Wildlife Day)’ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కనుమరుగైపోతున్న జాతులను కాపాడేందుకు అయా ప్రభుత్వాలు అనేక జాగ్రత్తలు, చర్యలు కూడా చేపట్టాయి. అయితే మాంసం కోసం ప్రత్యేకంగా పెంచే మేకలు, గొర్రెలు, బర్రెలు, పందులు, చేపలు, కోళ్లను సైతం రక్షించేందుకు త్వరలోనే ప్రత్యేక చట్టాలు రాబోతున్నట్లు అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ఏజెన్సీ ‘ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్’ (FWS) హింట్ ఇచ్చింది. ఎందుకంటే అమెరికా దేశాలకు చెందిన ప్రాంతాల్లో నివసిస్తున్న అరుదైన ‘లెస్సర్ ప్రైరీ కోడి’ని అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చినట్లు తాజాగా ప్రకటించింది.
న్యూ మెక్సికో రాజధాని శాంటా ఫే (SANTA FE, N.M – US)కు చెందిన ‘ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్’ (FWS) ‘లెస్సర్ ప్రైరీ’ని చికెన్ కోసం వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఐదు రాష్ట్రాల (టెక్సాస్, ఓక్లహోమా, కాన్సాస్, కొలరాడో, న్యూ మెక్సికో)లో ఈ పక్షి మనుగడ సాగిస్తుండగా ఉత్తర, దక్షిణ దిక్కులో నివసించే ఈ జాతులకు ప్రత్యేక అవసరాలు కల్పించాలని ప్రజలను కోరింది.‘లెస్సర్ ప్రైరీ-చికెన్’ను అంతరించిపోకుండా కాపాడాలని మేము ఆశిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణమే తీసుకోవడం అవసరమనిపించింది. ఇప్పటికే ఎంతోమంది వ్యక్తులు ఈ జాతులను కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందాల కుదుర్చుకుని పనిచేస్తున్నారు. అంతేకాదు లెస్సర్ చికెన్ తమ టేబుల్ పై చూడొద్దని కూడా ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు’ అని ఆడుబాన్ సౌత్‌వెస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నేషనల్ ఆడుబాన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ‘జోన్ హేస్(Joan Hayes)’ వెల్లడించాడు.
ఇక 1960లలో పక్షుల పర్యవేక్షణ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైనప్పటి నుంచి ‘లెస్సర్ ప్రైరీ-చికెన్’ వాడుతున్న వారిసంఖ్య 97 శాతం తగ్గినట్లు సదరు సంస్థ వెల్లడించింది. ‘దీని క్షీణత U.S.లోని అన్ని పక్షి జీవులలోకన్నా అత్యంత ప్రమాదకరమైనది. దీన్ని కాపాడకపోతే త్వరలోనే పూర్తిగా అంతరించిపోతుంది. ఇలాంటి జాతులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హాని కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటి పునరుద్ధరణ(Restoration) ప్రణాళికను అభివృద్ధి చేయడం చాలా అవసరం. భవిష్యత్ తరాలకు ఈ పక్షి ఉనికిని నిర్ధారించడం చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే ఏజెన్సీలు, పరిశ్రమలు కలిసి పనిచేస్తూ వీటి సంఖ్య మరింత పెంపొందిచేందుకు మార్గాలున్నాయి’ అని నేషనల్ ఆడుబాన్ సొసైటీ(National Audubon Society) పేర్కొంది.