end
=
Friday, November 22, 2024
క్రీడలుCricket:రేపే తొలి వన్డే
- Advertisment -

Cricket:రేపే తొలి వన్డే

- Advertisment -
- Advertisment -

  • ఆక్లాండ్‌ వేదికగా భారత్ Vs న్యూజిలాండ్ మ్యాచ్
  • ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై అభిమానుల్లో ఉత్కంఠ


భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలా సిరీస్‌లో భాగంగా (India vs Newzealand) ఆక్లాండ్‌ (Auckland) వేదికగా నవంబర్ 25న తొలి వన్డే (First ODI) జరగనుంది. టీ20 సిరీస్‌ (T20 series)లో న్యూజిలాండ్‌ (Newzealand)ను 1-0తో ఓడించిన తర్వాత వన్డే సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా (India) సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్ (Three ODI series) శుక్రవారం నుంచి ఆక్లాండ్‌లో ప్రారంభం కానుండగా వన్డే ట్రోఫీని (Trophy) కూడా కైవసం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతుంది. కాగా వన్డే కెప్టెన్‌ (ODI captain)గా వ్యవహరించనున్న శిఖర్ ధావన్ (Shikhar Dhawan)ఎలాంటి ఆటగాళ్లతో బరిలోకి దిగనున్నడోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ (Playing XI) విషయంలో ఇప్పటికే సంజూ శాంసన్ , ఉమ్రాన్ మాలిక్ (Sanju Samson, Umran Malik) లాంటి ఆటగాళ్లకు టీ20 సిరీస్‌లో అవకాశం రాలేదు. అయితే కనీసం వన్డే సిరీస్‌లోనోనైనా అవకాశం వస్తుందా? అనే సందేహాలు తీరాల్సి ఉంది. వ్యూహాత్మక కారణాల వల్లే సంజూకు అవకాశం రాలేదని కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)టీ20 సిరీస్‌లో పేర్కొన్నాడు. మరి వన్డే సిరీస్‌లో ఎలాంటి జట్టుతో బరిలోకి దిగనున్నారోనని చర్చ నడుస్తోంది. సంజూ శాంసన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి ఆటగాళ్లు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడం ఇంకా కష్టంగా ఉంది. ఎందుకంటే భారత జట్టులో మరెందరో ప్లేయర్లుకు వీరికి గట్టి పోటీని ఇస్తున్నారు. మరి ఇలాంటి ప్లేయర్ల మధ్య వీరు ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంటారా లేదా అనే ఆసక్తి పెరిగిపోతుంది.

జట్టులో రిషబ్ పంత్ (Rishabh Pant) రూపంలో వికెట్ కీపర్ ఉన్నందున సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లకు అవకాశం లభించడం కష్టం. అదే సమయంలో దీపక్ హుడా (Deepak Hooda) కూడా ఈ జట్టులో ఉన్నాడు. అతను ఆల్ రౌండర్. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ (Deepak Chahar, Shardul Thakur) వంటి బౌలర్లు జట్టులో ఉన్నందున ఉమ్రాన్ మాలిక్ కూడా ఆడటం కష్టమే. అలాగే టీ20 ఫార్మాట్‌లో అద్భుతాలు చేసిన అర్ష్‌దీప్ సింగ్‌ (Arshdeep Singh) కు అరంగేట్రం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ప్లేయింగ్ ఎలెవన్‌లో టాప్ 6?
ఓపెనర్లుగా శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌ (Shikhar Dhawan, Shubman Gill)లు బరిలోకి దిగడం ఖాయం. శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) గత న్యూజిలాండ్ టూర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కాబట్టి అతని స్థానం ఖాయమైంది. దీంతో పాటు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా ఆడటం ఖాయమంటున్నారు. వన్డే సిరీస్‌లో రిషబ్ పంత్ వైస్ కెప్టెన్. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయనున్నాడు. ఇప్పుడు ఆరో నంబర్ బ్యాట్స్ మెన్ కోసం దీపక్ హుడా, శాంసన్ మధ్య పోరు జరగనుంది. యుటిలిటీ ప్లేయర్ (Utility player) కావడంతో హుడాదే పైచేయిగా నిలుస్తుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తన సత్తా చాటాడు.

బౌలింగ్ బాధ్యత ఎవరికి ఇస్తారు?
బౌలింగ్ గురించి మాట్లాడితే, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ (Yuzvendra Chahal, Kuldeep Yadav) స్పిన్ అటాక్‌లో ఆడటం దాదాపు ఖాయం. అటువంటి పరిస్థితిలో ఉమ్రాన్ మాలిక్ బెంచ్ మీద కూర్చోవచ్చు.

(Disha Patani:అద్దం ముందు అర్ధనగ్నంగా దిశా.. రోహిత్, రిషబ్ షాక్‌)

IND vs NZ Playing XI
తొలి వన్డే కోసం భారత్‌ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ : శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్. (Shikhar Dhawan, Shubman Gill, Shreyas Iyer, Suryakumar Yadav, Rishabh Pant, Deepak Hooda, Deepak Chahar, Shardul Thakur, Arshdeep Singh, Kuldeep Yadav, Yuzvendra Chahal.)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -