బాలీవుడ్ నిర్మాత, దర్శకురాలు(Director) ఏక్తా కపూర్ తనకు అత్యంత ఇష్టమైన కథల గురించి ఓపెన్(Open) అయింది. మహిళా కోణం నుంచి కథ చెప్పడం తనకు ఎందుకు ఇష్టమో కూడా ఈ సందర్భంగా వెల్లడించింది. అంతేకాదు మహిళల స్టోరీస్ పురుషుల కథలకన్నా రసవత్తరంగా ఉంటాయన్న ఆమె తాను ఒక స్త్రీ అని ఈ విషయం చెప్పట్లేదని తెలిపింది.
ఇటీవల తాజాగా ఓ ఇంటర్వ్యూలో(Interview) పాల్గొన్న ఏక్తా.. ‘నేను నా సొంత లింగానికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను అనే వాస్తవం కంటే.. జనాభాలో సగం మంది మహిళలు తమ స్థాయికి మించి ఇల్లు, పిల్లలు, ఉద్యోగం వంటి తదితర అంశాల్లో రిమోట్(Remote)లా తమ కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తున్నారు. అందుకే పురుషుల కథనాల కంటే స్త్రీల కథలే చాలా రసవత్తరమైనవని, బహు కోణాలను కలిగివుంటాయని బలంగా నమ్ముతా. అందులోనూ స్వదేశీ మహిళల కథలు చెప్పడం చాలా ఇష్టం’ అని స్పష్టం చేసింది. అలాగే ‘XXX’, ‘గంధీ బాత్’, ‘బెకాబూ’, ‘రాగిణి MMS 2’ వంటి చిత్రాల్లో స్పష్టమైన బోల్డ్ కంటెంట్‌ను చూపిస్తూ యువ హృదయాలను భ్రష్టు పట్టిస్తోందంటూ సుప్రీం కోర్టు నుంచి చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావడాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపింది.