- ఢిల్లీలోని రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ వెలుపల అటాక్
- పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చిన పోలీసులు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్దా వాకర్ కేసు (Shraddha Walker’s case)ని ఢిల్లీ పోలీసులు (Dellhi Police) వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా (Aftab Poonawala) ప్రయాణిస్తున్న వ్యాన్ (van)పై ఢిల్లీలోని రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ (Forensic Lab in Rohini) sవెలుపల దాడి జరిగింది. అంబేద్కర్ (Ambedkar Hospital) ఆసుపత్రిలో పాలిగ్రాఫ్ పరీక్ష (Polygraph test ) ముగిసిన అనంతరం అఫ్తాబ్‌ను జైలుకి (Jail) తరలిస్తున్న సందర్భంగా జైలు వ్యాన్‌పై దాడి చేశారు.
ఇక శ్రద్ధా హత్య కేసులోని నిందితుడు అఫ్తాబ్.. పోలీసుల విచారణలో రకరకాల సమాధానాలు చెబుతూ పోలీసులను నిత్యం గందరగోళానికి గురిచేస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో పోలీసులు నార్కో , పాలిగ్రఫీ పరీక్ష కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు (court) అనుమతితో సోమవారం నాల్గవ దశ పాలిగ్రఫీ పరీక్ష ను నిర్వహించారు. పాలిగ్రాఫ్ పరీక్ష అనంతరం ఎఫ్‌ఎస్‌ఎల్ (FSI) నుంచి జైలుకు అఫ్తాబ్‌ను తీసుకెళ్తున్న వాహనంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అఫ్తాబ్ పాలిగ్రాఫ్ పరీక్ష జరుగుతున్న సమయంలో ఎఫ్‌ఎస్‌ఎల్ కార్యాలయం ఎదుట కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి అఫ్తాబ్‌తో వెళ్తున్న వ్యాన్‌పై దాడి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, దాడి చేసిన వారి సంఖ్య 4 నుండి 5 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులు పరిస్థితిని నియంత్రణలోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిలో ఒకరు శ్రద్ధకు న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే.. శ్రద్దా కేసు రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతోంది. అప్థాజ్ తన గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చిన శ్రద్దా ఉంగరాన్ని (Ring), హత్యాఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రద్ధను చంపిన తర్వాత, అఫ్తాబ్ ఈ ఉంగరాన్ని వృత్తిరీత్యా సైకాలజిస్ట్ (psychologist)అయిన తన మరో గర్ల్ ఫ్రెండ్ (girl friend)కు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రద్దా కేసులో కీలక మలుపు.. మరో గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చిన శ్రద్దా ఉంగరాన్ని, హత్యాఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఢిల్లీలోని మెహ్రౌలీలో (Mohrali) జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక సాక్ష్యం దొరికినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు శ్రద్ధా హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయుధం రికవరీతో(recovery) పాటు పోలీసులు ఈ ఆయుధాన్ని దర్యాప్తు కోసం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (Central Forensic Science Laboratory) (CFSL)కి పంపారు. అంతేకాదు శ్రద్ధకు చెందిన ఉంగరాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. శ్రద్ధను చంపిన తర్వాత, అఫ్తాబ్ ఈ ఉంగరాన్ని వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన తన మరో గర్ల్ ఫ్రెండ్ కు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
(PM MODI:ఉగ్రవాదమే కాంగ్రెస్ ఓటు బ్యాంక్)
శ్రద్దా హత్య కేసు వెలుగులోకి వచ్చి నెలకు పైగా గడిచిపోయింది. అయితే నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా ప్రియుడు అఫ్తాబ్ తాను శ్రద్దాను హత్య చేసిన తర్వాత 35 ముక్కలుగా నరికినట్లు విచారణలో చెప్పాడు. ఈ దారుణ మారణకాండ తర్వాత అఫ్తాబ్ ప్రతిరోజూ కొత్త విషయాలు వెల్లడిస్తున్నాడు. అయితే అతని మాటలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అఫ్తాబ్ ఇస్తున్న సమాచారం తమను అయోమయానికి గురిచేసి దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు భావించారు. దీంతో పోలీసులు అఫ్తాబ్ కి నార్కో , పాలిగ్రఫీ పరీక్షల నిమిత్తం అనుమతి కోరారు. కోర్టు నుంచి అనుమతి లభించిన తర్వాత అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ కేసులో ముఖ్యమైన ఆధారం పోలీసులకు లభించింది.
నేడు నాలుగో దశ పాలిగ్రాఫ్ పరీక్ష (Polygraph test) శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు నాలుగో దశ పాలిగ్రాఫ్ పరీక్ష నేడు నిర్వహించారు. డిసెంబర్ 5న నార్కో టెస్ట్ (Narco test on December 5) చేయవచ్చు. ఈ మేరకు ఆదివారం వర్గాలు వెల్లడించాయి. రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో సోమ, మంగళవారాల్లో రెండు సెషన్ల పాలిగ్రాఫ్ పరీక్ష ఉంటుందని తెలిపారు. పూనావాలా ఇప్పటికే మూడు సెషన్ల పాలిగ్రాఫ్ పరీక్షను పూర్తి చేశారు. పాలిగ్రాఫ్ పరీక్షను లై డిటెక్టర్ పరీక్ష (Lie detector test) అని కూడా అంటారు. పాలిగ్రాఫ్ పరీక్షలో, రక్తపోటు, పల్స్ , శ్వాస రేటు (Blood pressure, pulse, respiratory rate) వంటి శారీరక లక్షణాలు నమోదు చేయబడతాయి. నిందితుడు నిజం చెబుతున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఈ డేటా ఉపయోగిస్తారు.
గొంతుకోసి హత్య చేసి ఆపై నరికి చంపిన అఫ్తాబ్: ముంబై నివాసి శ్రద్ధా వాకర్ (27)ని ఆమె లివ్ -ఇన్ పార్ట్‌నర్ (Live-in partner) పూనావాలా గొంతు కోసి హత్య చేసి తరువాత ఆ మృతదేహాన్ని 35 ముక్కలుగా చేశాడు. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలోని తన ఇంట్లో 300 లీటర్ల రిఫ్రిజిరేటర్ (Refrigerator)లో సుమారు మూడు వారాల పాటు ఉంచాడు. ఆ ముక్కలను వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కటిగా విసిరాడు. నవంబర్ 12న పోలీసులు పూనావాలాను అరెస్ట్ చేసి పోలీసు కస్టడీకి పంపారు. నవంబర్ 17న అతని కస్టడీని ఐదు రోజుల పాటు పొడిగించారు. మంగళవారం మరో నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపారు. శనివారం ఢిల్లీ కోర్టు పూనావాలాను 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.