end
=
Saturday, November 23, 2024
వార్తలుజాతీయంPM MODI:విభజన సిద్ధాంతాన్ని వీడితేనే కాంగ్రెస్‌కు మేలు
- Advertisment -

PM MODI:విభజన సిద్ధాంతాన్ని వీడితేనే కాంగ్రెస్‌కు మేలు

- Advertisment -
- Advertisment -

  • ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక సూచన


మరో రెండు రోజుల్లో గుజరాత్‌లో (Gujarath) తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Assembly election polling) జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో కాంగ్రెస్ (Congress)తిరిగి ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలంటే ‘విభజించు పాలించు’ (‘Divide and rule’) సిద్ధాంతాన్ని వదలిపెట్టాలని సూచించారు. సోమవారం బీజేపీ (BJP) అభ్యర్థుల తరుఫున భావ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని అన్నారు. దీనికి కారణం ఒక ప్రాంతం లేదా వర్గానికి చెందిన ప్రజలను మరో ప్రాంత ప్రజలకు మధ్య చిచ్చు‌పెట్టి రెచ్చగొట్టడమేనని పేర్కొన్నారు.

(PM MODI:ఉగ్రవాదమే కాంగ్రెస్ ఓటు బ్యాంక్)

అలాగే కాంగ్రెస్ పార్టీ విధానం వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని మోదీ తెలిపారు. దేశాన్ని విభజించే అంశాలకు అండగా నిలిచే వారికి గుజరాత్ ప్రజలు మద్దతివ్వరని పేర్కొన్నారు. బీడు బారిన సౌరాష్ట్ర (Saurashtra) ప్రాంతానికి నర్మదా జలాలు చేరకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మోడీ ఆరోపించారు. ‘కాంగ్రెస్ సిద్ధాంతమే విభజించడం-పాలించడం. గుజరాత్ రాష్ట్రం విడిపోయే ముందు మరాఠీలకు గుజరాతీయులకు మధ్య చిచ్చు (Marathi and Gujaratis) పెట్టారు. ఆ తర్వాత కులాలు, కమ్యూనిటీల (Community)మధ్య ఘర్షణ తీసుకొచ్చారు. కాంగ్రెస్ చేసిన పనులతో గుజరాత్ తీవ్రంగా నష్టపోయింది’ అని పేర్కొన్నారు. గుజరాతీలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని, విభజన శక్తులను తరిమేందుకు తలుపులు తెరిచారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిస్థితి మారిపోయిందని, గత 20 ఏళ్లలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. కాంగ్రెస్ విభజించు-పాలించు సిద్ధాంతాన్ని వీడితేనే తిరిగి గుజరాత్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుందని ఉద్ఘాటించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -