end
=
Thursday, November 21, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Broccoli:బ్రోకలీ తో అద్భుతం
- Advertisment -

Broccoli:బ్రోకలీ తో అద్భుతం

- Advertisment -
- Advertisment -

  • గ్రహాంతర జీవుల ఉనికిని సూచిస్తున్న వాయువు
  • కమ్యూనికేట్ అయ్యేందుకుశాస్త్రవేత్తల ప్రయోగాలు


గ్రహాంతర జీవుల జాడ (Traces of alien life) లు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు తరచూ పరిశోధనలు (Scientists research) చేస్తున్నారు. ఇక ఆ పరిశోధన నేపథ్యంలో వాటితో కమ్యూనికేట్ (Communicate) అయ్యేందుకు అనేక టెక్నాలజీ (Technology)లను రూపొందిస్తున్నారు. అయినా నేటికీ వాటి జాడలను తెలుసుకునే భాగ్యం లేకపోయింది. ఎప్పుటికైనా వాటితో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో.. తాజాగా పరిశోధకులు ‘బ్రోకలి’ (‘Broccoli’) మొక్క నుంచి వెలువడే వాయువు (gas)తో గ్రహాంతర ఏలియన్స్ (Extraterrestrial Aliens)ఉనికిని కనుగొనే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే భూమిపై (Earth) కనిపించే ఈ మొక్క అందరికీ తెలిసిందే. క్యాబేజీ (Cabbage) కుటుంబానికి చెందిన బ్రోకలి మొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను శరీరానికి అందిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు (Nutrients, minerals, vitamins) మానవ శరీరానికి (human body) అధికంగా అందించి ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.

బ్రోకలి ప్లానెట్‌ (Broccoli Planet)లపై నివశించే ఏలియన్ల ఉనికిని సూచించే వాయువులను విడుదల చేయగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బ్రోకలి, ఆల్గే (Algae)తో సహా భూమిపై ఉన్న ఇతర మొక్కలు, సూక్ష్మజీవు (Plants, microorganism)లు వాటిని వాయువులుగా మార్చడం ద్వారా విషాన్ని తొలగిస్తాయని అభిప్రాయపడుతున్నారు. అయితే అలా చేసే ప్రక్రియను మిథైలేషన్‌(Methylation) (ఇది శరీరంలో ఒక రసాయన ప్రతిచర్య. దీనిలో మిథైల్ సమూహం అని పిలువబడే చిన్న అణువు డిఎన్ఏ (DNA), ప్రోటీన్లు లేదా ఇతర అణువులకు జోడించబడుతుంది. మిథైల్ సమూహాల కలియిక శరీరంలో కొన్ని అణువులు ఎలా పనిచేస్తుందో ప్రభావితం చేస్తుంది)గా గుర్తించారు. కాగా ఇప్పుడు లెజెండ్రీ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ (legendary James Webb Space Telescope) లోని పరికరాలను ఉపయోగించి అటువంటి వాయువుల ఉనికిని గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (University of California), రివర్‌సైడ్‌ (Riverside)కు చెందిన ప్లానెట్ శాస్త్రవేత్త మైఖేలా లెంగ్ (Planetary scientist Michaela Leung) చేసిన కొత్త అధ్యయనం ప్రకారం.. జీవి కానిది ఏదైనా ఈ వాయువులను విడుదల చేయడం చాలా అసంభవం అని పేర్కొన్నారు.

(Good Health:మంచి మనసుంటేనే దీర్ఘకాలిక ఆరోగ్యం)

బ్రోకలి ద్వారా జీవి జాడలను కనుగొనడం:
‘భూమిపై మిథైలేషన్ (Methylation) విస్తృతంగా ఉంది. కాబట్టి జీవి ఎక్కడైనా దానిని అమలు చేస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇందులో చాలా కణాలకు హానికరమైన పదార్థాలను బహిష్కరించే యాంత్రాంగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వాయువును నాన్-బయోలాజికల్ (Non-biological) త(జీవుల సహజ ప్రక్రియలతో సంబంధం లేకుండా.. ద్రవం జీవరహిత పదార్థాల కలయికను కలిగి ఉంటుంది) మార్గాల ద్వారా సృష్టించడానికి పరిమిత మార్గాలు ఉన్నాయి. అందువల్ల ఇది జీవానికి మరింత సూచిక’ అని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే అగ్నిపర్వత విస్ఫోటనాల (Volcanic eruptions) నుండి అటువంటి వాయువులు బహిష్కరించబడటానికి ఒక చిన్న అవకాశం ఉన్నప్పటికీ.. జీవులు మిథైలేటెడ్(విషపూరితమైన, ఎక్కువగా మండే, రంగులేని వాయువు. రక్తం, మెదడు, ఇతర జంతువులు, మొక్కల కణజాలాలలో సహజంగా సంభవిస్తుంది. నోటి దుర్వాసన, అపానవాయువు వాసన కలిగించే ప్రధాన రసాయనాలలో ఇది ఒకటి) వాయువులను ఎక్కువగా ఉత్పత్తి చేయడంతో.. ఈ వాయువులు మిడ్-ఇన్‌ఫ్రారెడ్‌ (Mid-infrared) (శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఉపయోగించబడిన ఒక విశ్లేషణాత్మక సాంకేతికత)లో కనిపిస్తాయి. దీంతో ఇది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (James Webb Space Telescope) సిద్ధాంతపరంగా.. ప్లానెట్ వాతావరణంలో తేలుతున్న గ్యాస్ కణాలను కనుగొనగలదని సూచిస్తుంది.

అందువల్ల జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ శక్తివంతమైన సాధనాలతో (NIRSpec పరికరం వంటిది) కూడా మిథైలేటెడ్ వాయువుల జాడలను కనుగొనడానికి ఇది ఒక ఎక్సోప్లానెట్ (Exoplanet) సమీపంలోకి వందకు పైగా ప్రయాణాలను చేస్తుంది. దీంతో గ్రహంపై జాడలేని జీవిని చేధిస్తే ఎన్నో శతాబ్దాలుగా పరిశోధనలలో ప్రశ్నగా మిగిలిన శాస్త్రవేత్తల శ్రమకు ఇదొక సమాధానంలా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

(Hemagenics:ఒక్క డోస్‌ రూ.28 కోట్లు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -